Skip to main content

ఇంజనీరింగ్‌ కెరీర్‌పై..ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ - ఏపీ, ‘సాక్షి’ సంయుక్తంగా వెబినార్‌

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌లో కంప్యూటర్‌ సైన్స్‌/సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌ కోర్సులకు దీటుగా అందుబాటులో ఉన్న కెరీర్‌ అవకాశాలపై ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ - ఏపీ, ‘సాక్షి’సంయుక్తంగా వెబినార్‌ను నిర్వహించనున్నాయి.


జూలై 27వ తేదీ సాయంత్రం 4:00 నుంచి 5:30 వరకు కొనసాగే ఈ వెబినార్‌లో ప్రముఖ సబ్జెక్ట్‌ నిపుణులు విద్యార్థులకు అవగాహన కలి్పంచనున్నారు. ఇంటర్‌ తర్వాత ఏయే కోర్సులు అందుబాటులో ఉన్నాయి? వాటితో ఎలాంటి కెరీర్‌ అవకాశాలు లభించనున్నాయి? లాంటి ఎన్నో సందేహాలకు ఈ వెబినార్‌ ద్వారా సమాధానాలు తెలుసుకోవచ్చు. వెబినార్‌లో ప్రముఖ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు డాక్టర్‌ సత్య ప్రమోద్‌ జమ్మీ (మెకానికల్‌ ఇంజనీరింగ్‌), డాక్టర్‌ ఉమా మహేశ్వర్‌ ఆరేపల్లి (సివిల్‌ ఇంజనీరింగ్‌), డాక్టర్‌ సోమేశ్‌ వినాయక్‌ తివారీ (ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌), డాక్టర్‌ ఓం జీ పాండే (ఎల్రక్టానిక్స్‌– కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌) పాల్గొననున్నారు. www.arenaone.in/webinar వెబ్‌సైట్‌ ద్వారా రిజిస్ట్రేష‌న్‌ చేసుకోవచ్చు లేదా క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి. ఈ వెబినార్‌ను https://youtube/db3Vh5L&u3o యూట్యూబ్‌ లింక్‌ ద్వారా చూడొచ్చు.

Edu news

Published date : 26 Jul 2021 11:29AM

Photo Stories