జేఎన్టీయూలో ‘Finite Element Analysis’
Sakshi Education
కొండగట్టు(చొప్పదండి): కొడిమ్యాల మండలం నాచుపల్లి ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఫైనెట్ ఎలిమెంట్ అనాలసిస్ యూజింగ్ ఆన్సిస్ వర్క్ బెంచ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
మెకానికల్ విభాగాధిపతి కె.వసంత్ కుమార్ మాట్లాడుతే ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి ఏదైనా రియల్ ప్రొడక్ట్‌ను నిజంగా తయారు చేయకుండానే.. దాని మోడల్‌ను ప్రిపేర్ చేసుకుని అది ఎంతవరకు పనిచేస్తుందో తెలుసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఏదైనా ప్రొడక్ట్ కచ్చితంగా ఎలా పనిచేస్తుంది..? ఏ మెటీరియల్ వాడాలి..? అనే విధానం సులభంగా తెలుసుకుని కావాల్సిన పరికరాలను తయారు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
ప్రిన్సిపాల్ కామాక్షి ప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ టి.వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ వర్క్‌షాప్‌నకు సహకరించిన రిసోర్స్ పర్సన్ రాజమహేంద్ర, సిములేషన్ ఇంజినీరింగ్ (హైదరాబాద్), మెకానికల్ ఫ్యాకల్టీ కో–కన్వీనర్ సురేష్ అర్జుల, కో–ఆర్డినేటర్ బి.నర్సయ్యకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.
Published date : 14 Feb 2024 09:58AM