ANU: ‘ఇంజినీరింగ్ టెస్ట్’ దరఖాస్తు గడువు పెంపు
Sakshi Education
ఏఎన్‌యూ: డాక్టర్ వైఎస్సార్ ఏఎన్‌యూ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రవేశాల కోసం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నిర్వహిస్తున్న ఏఎన్‌యూ ఇంజినీరింగ్ టెస్ట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించామని వర్సిటీ అడ్మిషన్ల డైరెక్టర్ డాక్టర్ జి.అనిత తెలిపారు.
ముందుగా నిర్ణయించిన ప్రకారం జూన్ 19తో గడువు ముగిసిందని, విద్యార్థుల వినతి మేరకు గడువు పొడిగించినట్లు పేర్కొన్నారు. రూ.750 ఆలస్య రుసుముతో జూలై 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ప్రవేశ పరీక్ష తేదీని త్వరలో ప్రకటిస్తామని ఆమె జూన్ 19న వెల్లడించారు.
చదవండి:
Foundations of Modern Machine Learning: ట్రిపుల్ ఐటీలో టీచర్–సహాయక ఆన్‌లైన్ కోర్సు
Published date : 20 Jun 2023 02:51PM