AU Notification: ఏయూలో సాయంకాలం కోర్సులు
సాక్షి ఎడ్యుకేషన్: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంటెక్, ఎం.ప్లానింగ్ సాయంకాలం కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. స్థానికంగా ఉద్యోగం చేస్తున్న వారికి ఈ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నట్లు ప్రవేశాల సంచాలకుడు ఆచార్య డి.ఎ.నాయుడు తెలిపారు.
అర్హత, ఆసక్తి కలిగిన వారు ఈ నెల 18లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంటెక్ కెమికల్ ఇంజినీరింగ్, స్ట్రక్చరల్ ఇంజినీరింగ్, పవర్ ఎలక్ట్రానిక్ డ్రైవర్స్ అండ్ కంట్రోల్స్, రాడార్–మైక్రోవేవ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇన్‌స్ట్రుమెంటేషన్, నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ మైరెన్ ఇంజినీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, క్యాడ్–క్యామ్, థర్మల్ ఇంజినీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, మెడికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇండస్ట్రియల్ మెటలర్జీ, కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎం.ప్లానింగ్(ఎన్విరాన్‌మెంటల్) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తామన్నారు. మరిన్ని వివరాలకు www.audoa.in సందర్శించవచ్చు.
Andhra Pradesh: అత్యాధునిక సదుపాయాలతో ప్రభుత్వ వైద్య కళాశాల
ఓపెన్ టెన్త్, ఇంటర్ ఫీజు చెల్లించాలి
సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఒకసారి తప్పిన వారికి 2024 ఏప్రిల్‌లో పరీక్ష రాసే అవకాశం కల్పిస్తున్నట్లు డీఈవో చంద్రకళ ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతికి ఒక్కో సబ్జెక్టుకు రూ.100లు, ఇంటర్మీడియట్ ఒక్కో సబ్జెక్టుకు రూ.150లు, ప్రాక్టికల్ ఒక్కో సబ్జెక్టుకు రూ.100లు ఫీజు అక్టోబర్ 15లోగా ఫీజు చెల్లించాలన్నారు. ఇంటర్మీడియట్ ఇంఫ్రూవ్‌మెంట్‌కు కూడా అవకాశం ఉందని, పూర్తి వివరాల కోసం స్టడీ సెంటర్లలో సంప్రదించాలన్నారు.