Skip to main content

Engineering: నోటిఫికేషన్‌ ఇచ్చాకే మేనేజ్‌మెంట్‌ సీట్లు

Private Engineering Collegeలు Management Seatsను ఇష్టారాజ్యంగా కేటాయిస్తే ఉపేక్షించేది లేదని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌. లింబాద్రి హెచ్చరించారు.
Engineering
నోటిఫికేషన్‌ ఇచ్చాకే మేనేజ్‌మెంట్‌ సీట్లు

తాము నోటిఫికేషన్‌ ఇచ్చాకే సీట్ల భర్తీ చేపట్టాలని, ఇందుకు విరుద్ధంగా వ్యవహరించే కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు. మండలి కార్యాలయంలో ఆయన ఆగస్టు 26న మీడియాతో మాట్లాడుతూ బీ–కేటగిరీ సీట్లకు ప్రైవేటు కాలేజీలు బేరసారాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ విధానం సమర్థనీయం కాదన్నారు. బీ–కేటగిరీ సీట్లను ఎలా భర్తీ చేయాలనే దానిపై AICTE, రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు రెండ్రోజుల్లో విధివిధానాలు ప్రకటిస్తామని చెప్పారు. ఆ తర్వాత సీట్ల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్‌ ఇస్తామని తెలిపారు. ఈలోగా సీట్లు అయిపోతున్నాయంటూ ప్రచారం చేయడం సరికాదన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తొందరపడి బీ–కేటగిరీ సీట్లకు డబ్బు కట్టొద్దని... మధ్యవర్తులను ఆశ్రయించవద్దని సూచించారు. గుజరాత్‌లో 50 శాతం మేనేజ్‌మెంట్‌ సీట్లుంటే ఏపీలో 30 శాతం ఉన్నాయని, అయితే ఆ రాష్ట్రాల్లో పోటీ అంతగా లేదని తెలిపారు. తెలంగాణలో పోటీ వాతావరణం ఉండటంతో కొన్ని కాలేజీలు విద్యార్థులను గందరగోళపరుస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఆఫ్‌ క్యాంపస్‌ పేరుతో కొన్ని యూనివర్సిటీలు గుర్తింపు లేకుండా అడ్మిషన్లు చేస్తున్నాయని, UGC అనుమతి లేని ఈ సంస్థలు ఇచ్చే సర్టిఫికెట్లు చెల్లవని... అందువల్ల విద్యార్థులు అలాంటి వర్సిటీల్లో చేరొద్దని ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి స్పష్టం చేశారు.

చదవండి: 

Published date : 27 Aug 2022 01:49PM

Photo Stories