CEO Outlook Pulse: జనరేటివ్ ఏఐపై పోటాపోటీ! సీఈవోలు ఏం చెప్పారంటే..
అత్యధిక పెట్టుబడులు
జనరేటివ్ ఏఐ టెక్నాలజీ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు కంపెనీల మధ్య పోటీ బాగా పెరిగింది. అనేక కంపెనీలు ఈ టెక్నాలజీపైనే అత్యధికంగా పెట్టుబడి పెడుతున్నాయి. భారత్‌కు చెందిన 50 మంది సీఈవోలపై నిర్వహించిన ఈవై సీఈవో అవుట్‌లుక్ పల్స్ 2023 సర్వేలో ఇదే విషయం వెల్లడైంది.
చదవండి: Artificial Intelligence: ఏఐతో మరో కొత్త ఆందోళన!
ఐదింట నాలుగొంతుల మంది సీఈవోలు ఈ జనరేటివ్ ఏఐపై అత్యధికంగా పెట్టుబడులు పెట్టనున్నట్లు పేర్కొన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కోసం కొత్త పెట్టుబడులు పెట్టడమో లేదా ఇప్పటికే ఉన్న తమ బడ్జెట్ నుంచి కేటాంపులు మళ్లించడమో చేస్తున్నట్లు సర్వేలో పాల్గన్న సీఈవోల్లో 84 శాతం మంది తెలిపారు.
జనరేటివ్ ఏఐ వేగవంతమైన పురోగతి, నియంత్రణ వాతావరణం దీనికి సంబంధించిన మూలధన కేటాయింపులను ప్రభావితం చేస్తున్నట్లు 62 శాతం మంది సీఈవోలు అభిప్రాయపడ్డారు.
అదే సమయంలో దీని వల్ల ఉద్యోగులపై పడే ప్రభావంపైనా ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో నిర్ణయం తీసుకోవడం సవాలుగా మారిందని 80 శాతం పేర్కొన్నారు.
చదవండి: Google Gemini: గూగుల్ అడ్వాన్స్‌డ్ ఏఐ మోడల్ 'గూగుల్ జెమిని'