ఇంజనీరింగ్ విద్యార్థులకు ‘బైట్ బైండింగ్ చాంపియన్‌షిప్’
‘ది బైట్ బైండింగ్ చాంపియన్‌షిప్ 2023’ పేరిట జరిగే ఈ చాంపియన్‌షిప్ ద్వారా దేశవ్యాప్తంగా ఆవిష్కరణలు, పాల్గొనేవారి సామర్థ్యాలు వెలికితీయడం, కొత్త ఆలోచనలు కలిగిన వారిని ఒకే వేదికపైకి తీసుకురావడం తదితరాలు లక్ష్యంగా ఈ ఛాంపియన్‌షిప్ పోటీలు నిర్వహిస్తున్నారు.
మూడు రౌండ్లలో ఎంబెడ్డెడ్ ఇంజనీర్ల హార్డ్‌వేర్, సిస్టమ్స్ థింకింగ్, టీమ్ వర్క్‌లో నైపుణ్యం పరీక్షించేలా ఈ చాంపియన్‌షిప్ పోటీని రూపకల్పన చేశారు. తొలి రెండు రౌండ్లలో పాల్గొనే వారిని వర్చువల్ విధానంలో సంక్లిష్టమైన కోడింగ్, హార్డ్‌వేర్ సవాళ్ల పరిష్కారానికి వారు అనుసరించే పద్ధతులను పరీక్షిస్తారు. ఇందులో అగ్రస్థానంలో నిలిచే 25 బృందాలను ఎంపిక చేసి మూడో రౌండ్లో ఎంబెడ్డెడ్ పజిల్స్ పరిష్కరించాల్సి ఉంటుంది.
చదవండి: Electric Rickshaws: పర్యావరణానికి అనుకూలంగా ఎలక్ట్రిక్ రిక్షాలు
పోటీలో విజేతలుగా నిలిచేవారికి రూ.లక్ష పారితోషికంతో పాటు స్టార్టప్‌లు, దిగ్గజ పారిశ్రామికవేత్తలు, ఇతర మార్గదర్శకులతో కలిసి పనిచేసే అవకాశం లభిస్తుంది. హైదరాబాద్ మినహా ఇతర ప్రాంతాల నుంచి ఈ చాంపియన్ షిప్‌లో పాల్గొనేందుకు వచ్చేవారికి వసతి సదుపాయాలకు అయ్యే ఖర్చును టీ వర్క్స్ చెల్లిస్తుంది.