Engineering: రెండోదశ సీట్ల కేటాయింపు
ఇందులో 81.87 % సీట్లు కేటాయించినట్టు సాంకేతిక విద్య విభాగం తెలిపింది. కంప్యూటర్ సైన్స్, దాని అను బంధ బ్రాంచీల్లోనే 94.44%, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక ల్స్‌లో 77.55% సీట్లు కేటాయించారు. సివిల్, మెకానికల్, ఇతర కోర్సుల్లో విద్యార్థులు ఆప్షన్లు ఇవ్వలేదు. సివిల్ ఇంజనీరింగ్‌లో 34.68%, మెకానికల్‌లో 28.79% సీట్లే్ల భర్తీ అయ్యాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్ బ్రాంచీల్లో వంద శాతం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 97.77% సీట్లు భర్తీ అయ్యాయి. డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఏఐఎంఎల్ కోర్సుల్లో 95% పైగా భర్తీ అయ్యాయి.
చదవండి: Success Story: పెట్రోల్ బంక్ వర్కర్ కుమార్తెను..అభినందించిన ఐఓసీఎల్ చైర్మన్
సగానికిపైగా కంప్యూటర్ కోర్సుల్లో...
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు 177 ఉంటే, ఇందులో కన్వీనర్ కోటా కింద రెండోదశలో 78,336 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈసారి 25,98,280 వెబ్ ఆప్షన్లు అందాయి. వీటి ఆధారంగా 64,134 సీట్లు కేటాయించారు. ఇంకా 14,202 సీట్లు మిగిలిపోయాయి. ఎక్కువభాగం సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ సహా ఇతర కోర్సుల్లోనే కన్పిస్తున్నాయి. మొదటి కౌన్సెలింగ్‌లో 42,998 సీట్లల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. తొలిదశలో మిగిలిపోయినవి, కొత్తగా కంప్యూటర్ కోర్సుల్లో పెరిగిన సీట్లను రెండోదశలో కేటాయించారు. ఈడ బ్ల్యూఎస్ కోటా కింద 5,265 సీట్లు భర్తీ చేశా రు.
చదవండి: Job Opportunities: ఈ యువతికి నాలుగు కంపెనీల్లో భారీ ఆఫర్లు...ఈమె మనస్సు మాత్రం ఈ కంపెనీ వైపే...
రిపోర్టింగ్‌కు చివరి గడువు అక్టోబర్ 18
రెండోదశలో సీట్లు పొందిన అభ్యర్థులు అక్టోబర్ 18 లోగా నిర్ణీత ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయా ల్సి ఉంటుంది. సీటు కేటాయింపుపత్రాన్ని ఆన్‌లైన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ట్యూషన్ ఫీజులపై నెలకొన్న సందిగ్ధతను దృష్టిలో ఉంచుకుని సాంకేతిక విద్య విభాగం దీనిపై స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న ఫీజులనే చెల్లించాలని, 2023కు హైకోర్టు తుది తీర్పునకు లోబడి, ప్రభుత్వం ప్రకటించే ఫీజులను తర్వాత చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.
చదవండి: Career Opportunities in Mobile App Development... నైపుణ్యాలు, కొలువులకు మార్గాలు..