Skip to main content

Job Opportunities: ఈ యువతికి నాలుగు కంపెనీల్లో భారీ ఆఫ‌ర్లు...ఈమె మ‌న‌స్సు మాత్రం ఈ కంపెనీ వైపే...

టాలెంట్‌ ఎక్కడున్నా వెతికి పట్టుకోవడంలో టెక్‌ దిగ్గజ కంపెనీలు ఎప్పుడూ ముందుంటాయి.
Sampriti Yadav
సంప్రీతి

ఈ తరుణంలో భారత్‌ నుంచి ఎక్కువ మేధోసంపత్తిని వెలికి తీస్తుంటాయి. బడా బడా కంపెనీల సీఈవోలుగా భారత మూలాలు ఉన్నవాళ్లు, భారీ ప్యాకేజీలు అందుకుంటున్న వాళ్లలో భారతీయ టెక్కీలు ఉండడమే ఇందుకు నిదర్శనం. ఇదిలా ఉంటే తాజాగా ఓ భారత యువతికి కోటి రూపాయలకు పైగా ప్యాకేజీతో బంపరాఫర్‌ ఇచ్చింది గూగుల్‌. 

మొత్తం తొమ్మిది రౌండ్ల ఇంటర్వ్యూలో..

Interview


కొవిడ్‌ టైంలో ఉద్యోగాల నియామకం కంపెనీలకు తలనొప్పిగా మారింది. అందునా టాలెంట్‌ ఉన్న ఉద్యోగులను లాగేసుకునేందుకు పోటాపోటీ పడుతున్నాయి కూడా. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్‌ కంపెనీలో పని చేస్తున్న సంప్రీతికి.. మరో టెక్‌ కంపెనీ గూగుల్‌ భారీ ప్యాకేజీ ఆఫర్‌ చేసింది. మొత్తం తొమ్మిది రౌండ్ల ఇంటర్వ్యూ క్లియరెన్స్‌ తర్వాత గూగుల్‌ ఆమెకు ఒక కోటి పది లక్షల రూపాయల ఏడాది శాలరీ ప్యాకేజీని ఆఫర్‌ చేసింది. ఇందుకు సంప్రీతి సైతం ఓకే చెప్పింది.

కుటుంబ నేపథ్యం..

 Sampriti Yadav Family
సంప్రీతి యాదవ్‌ స్వస్థలం బీహార్‌ రాజధాని పాట్నాలోని నెహ్రూ నగర్‌. తండ్రి రామ్‌శంకర్‌ యాదవ్‌ బ్యాంక్‌ ఆఫీసర్‌ కాగా, తల్లి ప్లానింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 

చ‌దువు : 
2014లో మెట్రిక్యులేషన్‌ పూర్తి చేసి.. 2016లో జేఈఈ మెయిన్స్‌ను క్లియర్‌ చేసింది సంప్రీతి. ఇక ఢిల్లీ టెక్నాలజికల్‌ యూనివర్సిటీలో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ పూర్తి చేసింది. 

ఉద్యోగాలు..

Jobs


బీటెక్‌ పూర్తి చేసుకున్న వెంటనే(2021లో) ఏకంగా నాలుగు కంపెనీలు ఆమె కోసం ఆఫర్‌ ఇచ్చాయి. అందులో ఫ్లిప్‌కార్ట్‌, అడోబ్‌ కంపెనీలు కూడా ఉన్నాయి. కానీ, ఆమె మాత్రం మైక్రోసాఫ్ట్‌ను ఎంచుకుంది. మైక్రోసాఫ్ట్‌లో ఆమె శాలరీ ఏడాదికి 44 లక్షల రూపాయల ప్యాకేజీ. ఇక ఫిబ్రవరి 14, 2022 తేదీన ఆమె గూగుల్‌లో చేరాల్సి ఉంది.

ఏకంగా ఓ స్టూడెంట్‌కు 2.05 కోట్ల జీతంతో..
ఇదిలా ఉంటే కిందటి ఏడాది జూన్‌లో పాట్నాకే చెందిన ఐఐటీ స్టూడెంట్‌ దీక్ష బన్సాల్‌(ఫైనల్‌ ఇయర్‌ కంప్యూటర్‌ సైన్స్‌ స్టూడెంట్‌)కు గూగుల్‌ 54 లక్షల ఏడాది ప్యాకేజీతో ఉద్యోగం ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు ఐఐటీ బీహెచ్‌యూకి చెందిన ఐదుగురు విద్యార్థులను ‘ఉబెర్‌’ ఇనయమించుకోగా.. అందులో ఓ స్టూడెంట్‌కు 2.05 కోట్ల జీతం ప్రకటించింది ఉబెర్‌.

Published date : 05 Jan 2022 01:04PM

Photo Stories