Engineering: అడ్మిషన్లు తేదీలు ఇవే..
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2022–23 విద్యా సంవత్సరానికి వివిధ ఇంజనీరింగ్ కోర్సులకు అడ్మిషన్ల ప్రక్రియ ఆగస్టు 6 లేదా 8 నుంచి ప్రారంభం కానుంది.
ఈ మేరకు సాంకేతిక విద్యా శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి AP EAPCET పరీక్షలను జూలై 4 నుంచి 12 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫలితాలు జూలై 29న విడుదలయ్యే అవకాశముంది. అనంతరం కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తారు. ఈఏపీసెట్‌లో ప్రతిభ, రిజర్వేషన్లను బట్టి కౌన్సెలింగ్ ద్వారా ఆయా కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ కౌన్సెలింగ్ ప్రక్రియకు ముందే రాష్ట్రంలోని కళాశాలల సంఖ్య, వాటిలోని కోర్సులు, సీట్ల సంఖ్య తేలాల్సి ఉంది. కళాశాలలకు సీట్లు, అనుమతుల పునరుద్ధరణకు సంబంధించి ఏఐసీటీఈ అనుమతుల గడువు జూలై 31తో ముగుస్తుంది. అనంతరం కళాశాలలు, సీట్ల వివరాలు ఖరారవుతాయి.
చదవండి:
Published date : 23 Jul 2022 04:41PM