Wipro Elite National Talent hunt 2022 : ప్రాజెక్ట్ ఇంజనీర్ కొలువు... రూ.3.5 లక్షల వార్షిక వేతనం
- » విప్రో ఎలైట్ నేషనల్ టాలెంట్ హంట్–2022 ప్రకటన విడుదల
- » బీఈ/బీటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అభ్యర్థులకు చక్కటి అవకాశం
ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ విప్రో.. బీఈ/బీటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్సులను పూర్తిచేసుకున్న, ప్రస్తుతం ఆఖరు ఏడాది చదువుతున్న విద్యార్థులకు జాబ్ ఆఫర్‌ను ప్రకటించింది. దీనిలో భాగంగా ఎలైట్ నేషనల్ టాలెంట్ హంట్ పేరుతో అర్హత పరీక్షలను నిర్వహించి.. ప్రతిభ కలిగిన అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తోంది. ఎంపికైన వారికి రూ.3.5 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాల్లోకి తీసుకుంటుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 31వ తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Also read: Engineering Career: బీటెక్.. బెస్ట్‌గా నిలవాలంటే!
ఎలైట్ నేషనల్ టాలెంట్ హంట్(ఎన్‌టీహెచ్)
ఇంజనీరింగ్ ఫ్రెషర్లకు అవకాశం ఇవ్వడానికి, అలాగే ఇంజనీరింగ్ విద్యలో నైపుణ్యాలు కలిగిన మానవ వనరులను తమ సంస్థల్లో నియమించుకోవడానికి విప్రో సంస్థ.. ఎలైట్ నేషనల్ టాలెంట్ హంట్–2022 నిర్వహిస్తోంది. ఇందులో ఎంపికైన వారికి ప్రాజెక్ట్ ఇంజనీర్ హోదాతో ఉద్యోగావకాశం కల్పిస్తారు. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి ఏడాది పాటు సంస్థలో తప్పనిసరిగా పనిచేయాల్సి ఉంటుంది.
అర్హతలు
- పదో తరగతి, ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతల్లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతోపాటు బీఈ/బీటెక్/ఇంటిగ్రేటెడ్‌లో ఎంటెక్ కోర్సుల్లో కనీసం 60శాతం మార్కులు సాధించాలి. 2020, 2021లలో కోర్సు పూర్తి చేసుకున్న అభ్యర్థులు, లేదా 2022లో బీఈ/బీటెక్ లేదా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ పూర్తిచేసుకోబోయే వాళ్లు దరఖాస్తుకు అర్హులు. ఫ్యాషన్ టెక్నాలజీ, టెక్స్‌టైల్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ టెక్నాలజీ కోర్సుల విద్యార్థులు తప్ప మిగతా అన్ని ఇంజనీరింగ్ బ్రాంచ్‌ల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి నుంచి డిగ్రీ వరకూ.. అకడమిక్ గ్యాప్ మూడేళ్లకు మించకూడదు. డిస్టెన్స్, పార్ట్‌టైమ్ విధానంలో చదివిన వారు దరఖాస్తుకు అనర్హులు. అసెస్‌మెంట్ సమయానికి ఒక బ్యాక్ లాగ్ సబ్జెక్ట్ కంటే ఎక్కువగా ఉండకూడదు. గత ఆరునెలల కాలంలో విప్రో ఎంపిక ప్రక్రియలో పాల్గొన్న వారికి దరఖాస్తుకు అవకాశం లేదు. వయసు: 25ఏళ్లకు మించుకుండా ఉండాలి.
Also read: Technology Jobs: బ్లాక్‌చైన్ డెవలపర్.. ఐబీఎం, అసెంచర్ వంటి కంపెనీల్లో ఉద్యోగం.. లక్షల్లో వేతనం.
ఎంపిక విధానం
- ఆన్‌లైన్ అసెస్‌మెంట్ ద్వారా అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 128 నిమిషాల కాలవ్యవధితో మూడు విభాగాల్లో పరీక్ష నిర్వహిస్తారు. అప్టిట్యూడ్ టెస్ట్, రిటన్ కమ్యూనికేషన్స్ టెస్ట్, ఆన్‌లైన్ ప్రోగ్రామింగ్ టెస్ట్ విభాగాల్లో అభ్యర్థి నైపుణ్యాలను పరీక్షిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి టెక్నికల్ అండ్ హెచ్‌ఆర్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. వీటిలోనూ ప్రతిభ చూపితే.. జాబ్ ట్రైనింగ్‌కి ఎంపిక చేస్తారు. శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకున్నవారిని ప్రాజెక్ట్ ఇంజనీర్ హోదాతో ఉద్యోగంలోకి తీసుకుంటారు.
పరీక్ష విధానం
- అప్టిట్యూడ్ టెస్ట్: ఈ విభాగంలో లాజికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఎబిలిటీ, ఇంగ్లిష్ వెర్బల్ ఎబిలిటీ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
- రిటన్ కమ్యూనికేషన్ టెస్ట్: ఈ విభాగానికి సంబంధించి 20 నిమిషాల కాలవ్యవధితో ఒక వ్యాసం ఇస్తారు.
- ఆన్‌లైన్ ప్రోగ్రామింగ్: కోడింగ్‌లో రెండు ప్రోగ్రామ్‌లు రాయాలి. ఇందుకోసం జావా, సి, సి++, పైథాన్.. వీటిలో ఏదైనా ఒకటి ఎంపిక చేసుకోవచ్చు. ఈ విభాగం పూర్తిచేయడానికి 60 నిమిషాల సమయం కేటాయిస్తారు.
ముఖ్యమైన సమాచారం
- దరఖాస్తు విధానం:
- ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
- దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 31, 2022
- వెబ్‌సైట్ : https://careers.wipro.com/elite