CUETలో ఖమ్మం విద్యార్థిని ప్రతిభ
Sakshi Education
ఖమ్మంసహకారనగర్: కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్టు (సీయూ ఈటీ)లో ఖమ్మానికి చెం దిన విద్యార్థిని ప్రతిభ కనబర్చింది.
జిల్లా కేంద్రంలోని బుర్హాన్ పురానికి చెందిన వున్నవ రిషిక కేంద్రియ విద్యాలయంలో పదో తరగతి వరకు చదవగా, ఇంటర్మీడియట్ హైదరాబాద్ లో పూర్తి చేసింది. ఈ క్రమంలో సీయూఈటీ రాసిన ఆమె 541 మార్కులు సాధించగా.. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (షిల్లాంగ్ క్యాంపస్)లోని అన్ని విభాగాల్లో సీటు సాధిం చింది.
చదవండి: CUET: ఆ ఐదు యూనివర్సిటీలు హాట్ ఫేవరెట్... సీయూఈటీకి పెరుగుతున్న క్రేజ్
తెలంగాణ నుంచి అన్ని విభాగాల్లో సీటు సాధించిన ఏకైక విద్యార్థినిగా రిషిక గుర్తింపు సాధించింది. ఆమె ఈ విద్యా సంవ త్సరం(2023-24) బీఏ హానర్స్ రీసెర్చ్ ఇం గ్లిష్ కోర్సు అభ్యసించాలని నిర్ణయించుకుంది. కాగా, రిషిక తండ్రి ఇంగ్లిష్ ఉపాధ్యాయుడైన కిరణకుమార్ కరోనా సమయంలో కన్నుమూ శాడు. ఐక్యరాజ్య సమితిలో ఉద్యోగం సాధించ డమే తన లక్ష్యంగా రిషిక చెబుతోంది.
Published date : 16 Aug 2023 05:20PM