న్యూఢిల్లీ: ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష(సీయూఈటీ)ను ఈ ఏడాది నుంచి 3 షిఫ్టుల్లో నిర్వహించనున్నట్లు యూజీసీ చైర్మన్ ఎం.జగదీష్ కుమార్ చెప్పారు.
ఇకపై ఇన్ని షిఫ్టుల్లో సీయూఈటీ
జేఈఈ, నీట్ వంటి కీలక పరీక్షలను సీయూఈటీలో కలిపేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రవేశ పరీక్షల సమ్మేళనం గురించి రెండేళ్లు ముందుగానే ప్రకటిస్తామన్నారు. సీయూఈటీ–యూజీ సెకండ్ ఎడిషన్ పరీక్షను ఎలాంటి లోపాలకు తావులేకుండా నిర్వహించేందుకు యూజీసీ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. గతంలో కొన్ని పొరపాట్లు జరిగిన మాట వాస్తవమేనని అంగీకరించారు. ఇకపై విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరీక్షపై దృష్టి పెట్టాలని సూచించారు.