Skip to main content

TS EdCET 2023 Results Out: టీఎస్‌ ఎడ్‌సెట్ ఫ‌లితాల విడుద‌ల‌... 98 శాతం ఉత్తీర్ణ‌త‌... అమ్మాయిలే టాప‌ర్స్‌

రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎడ్‌సెట్ ఫ‌లితాలు సోమ‌వారం(జూన్ 12న) సాయంత్రం 4 గంట‌ల‌కు విడుద‌ల‌య్యాయి. బీఈడీ కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం ప్ర‌తీ ఏడాది తెలంగాణ ఉన్న‌త విద్యామండ‌లి ఈ పరీక్ష‌ను నిర్వ‌హిస్తూ వ‌స్తోంది.
గొళ్ల వినీష, నీష
గొళ్ల వినీష, నీష

మే 18న మూడు సెషన్లలో నిర్వహించిన ప‌రీక్ష‌కు 31,725 మంది ద‌ర‌ఖాస్తు చేసుకోగా 27,495 మంది ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యారు. వీరిలో 26,994 మంది ఉత్తీర్ణ‌త సాధించారు. మొత్తం ఉత్తీర్ణ‌త శాతం 98.18గా న‌మోదైంది. 

Results

ఇక టాప్ 10 ర్యాంక‌ర్ల‌లో అమ్మాయిలు స‌త్తా చాటారు. స్టేట్ ఫ‌స్ట్ ర్యాంకుతో పాటు, సెకండ్‌, థ‌ర్డ్ ర్యాంకుల‌ను అమ్మాయిలే సొంతం చేసుకున్నారు. స్టేట్ ఫ‌స్ట్‌ ర్యాంకును వికారాబాద్‌కు చెందిన గొళ్ల వినీష సాధించింది. సెకండ్ ర్యాంకు బేగంపేట‌కు చెందిన నీష కుమారి, థ‌ర్డ్ ర్యాంకును ఎం సుషి సాధించారు. 

edcet
ఎం సుషి

టాప్ 10 ర్యాంక‌ర్ల‌లో న‌లుగురు అమ్మాయిలు, ఆరుగురు అబ్బాయిలు ఉన్నారు.
4వ ర్యాంకు వి చంద్ర‌శేఖ‌ర్‌, ఎ త‌రుణ్‌చంద్‌, టి ప్ర‌శాంత్‌, ఎం ష‌రీఫ్‌, కె. విన‌య్‌కుమార్‌, ఎం అరుణ్‌కుమార్‌, ఎ ల‌క్ష్మి గాయ‌త్రి.... వ‌రుస‌గా 5 నుంచి 10వ ర్యాంకు సాధించిన వారిలో ఉన్నారు. 

                                                                ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి
 

Published date : 12 Jun 2023 04:50PM

Photo Stories