Skip to main content

TSCHE: ఎడ్‌సెట్, పీఈసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌ ఎడ్‌సెట్‌–2023, టీఎస్‌ పీఈ సెట్‌–2023 ప్రవేశాల ప్రక్రియ సెప్టెంబర్‌ 19 నుంచి ప్రారంభం కానుంది.
TS EDCET and PECET Counseling Schedule Released, Important Exam Admission Dates
ఎడ్‌సెట్, పీఈసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

 ఈ రెండు సెట్‌లకు సంబంధించిన ప్రవేశాల కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను సెప్టెంబర్‌ 14న తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. టీఎస్‌సీహెచ్‌ఈ కార్యాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ఆర్‌.లింబాద్రి అధ్యక్షతన ప్రవేశాల కమిటీ సమావేశం జరిగింది.

ఇందులో భాగంగా టీఎస్‌ ఎడ్‌సెట్‌–2023, టీఎస్‌ పీఈసెట్‌–2023 ప్రవేశాలపై చర్చించిన అధికారులు.. ప్రవేశాల కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను ఖరారు చేశారు. సెప్టెంబర్‌ 19వ తేదీన ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌తో కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది.

చదవండి: PG admissions: పీజీ ప్రవేశాలకు వెబ్‌ కౌన్సెలింగ్‌

కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఇలా...

కౌన్సెలింగ్‌ ప్రక్రియ

టీఎస్‌ ఎడ్‌సెట్‌–2023

టీఎస్‌ పీఈసెట్‌–2023

నోటిఫికేషన్‌ జారీ

19.09.2023

19.09.2023

ఆన్‌లైన్‌ నమోదు, పరిశీలన, చెల్లింపు, సర్టిఫికెట్ల అప్‌లోడింగ్‌

20.09.23–30.09.23

20.09.2325.09.23

స్పెషల్‌ కేటగిరీ అభ్యర్థుల పరిశీలన

25.09.23–29.09.23

24.09.2325.09.23

సవరణలు

02.10.2023

27.09.2023

వెబ్‌ ఆప్షన్ల నమోదు ఫేజ్‌–1

03.10.23–05.10.23

28.09.23–29.09.23

వెబ్‌ ఆప్షన్ల సవరణ ఫేజ్‌–1

06.10.2023

30.09.2023

కళాశాలల వారీగా ప్రవేశాల జాబితా

09.10.2023

03.10.2023

కళాశాలల్లో రిపోర్టింగ్, ఫీజు చెల్లింపు

10.10.23–13.10.23

04.10.23–07.10.23

తరగతులు ప్రారంభం

30.10.2023

30.10.2023

Published date : 15 Sep 2023 11:57AM

Photo Stories