Skip to main content

EDCET 2022: కౌన్సెలింగ్‌ తేదీలు ఇవే..

సాక్షి, అమరావతి: బీఈడీ తదితర ఉపాధ్యాయ విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఎడ్‌సెట్‌–2022 వెబ్‌ కౌన్సెలింగ్‌ జనవరి 25 నుంచి ప్రారంభం కానుంది.
AP Edcet 2022 counseling dates
ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్ తేదీలు ఇవే..

దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఎడ్‌సెట్‌ కన్వీనర్‌ ప్రొఫె­సర్‌ కె.రామ్మోహనరావు జనవరి 24న విడుదల చేశారు. జనవరి 25 నుంచి 27వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని సూచించారు.

చదవండి: ఉపాధ్యాయ వృత్తికి మార్గం.. ఎడ్‌సెట్‌

28న ఆప్షన్లలో సవరణకు అవకాశమిచ్చి, 30న సీట్లు కేటాయిస్తామన్నారు. 31 నుంచి ఫిబ్రవరి 3 లోపు కాలేజీల్లో చేరాలని పేర్కొన్నారు. ఫిబ్రవరి 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు.

చదవండి: ఇక తెలంగాణ ఎడ్‌సెట్‌లో అన్ని సబ్జెక్టులకు ఒకే ప్రశ్నపత్రం..!

Published date : 25 Jan 2023 04:06PM

Photo Stories