Skip to main content

JNTUA:ఏపీ ఈసెట్‌-2024 బాధ్యతను జేఎన్‌టీయూ అనంతపురం కు!

ఏపీ ఈసెట్‌-2024 బాధ్యతను జేఎన్‌టీయూ అనంతపురం కు!
AP ECET-2024 responsibility to JNTU Anantapur JNTU Anantapur administration building hosting the AP ESET – 2024 office inauguration
ఏపీ ఈసెట్‌-2024 బాధ్యతను జేఎన్‌టీయూ అనంతపురం కు!

అనంతపురం: జేఎన్‌టీయూ అనంతపురం నూతన పాలక భవనంలో ఏపీ ఈసెట్‌ – 2024 కార్యాలయాన్ని సోమవారం ఏపీ ఈసెట్‌ రాష్ట్ర చైర్మన్‌/ జేఎన్‌టీయూ అనంతపురం వీసీ జీవీఆర్‌ శ్రీనివాసరావు ప్రారంభించారు. ఏపీ ఈసెట్‌ బాధ్యతను జేఎన్‌టీయూఏకు అప్పగించారు. ఇది వరకు ఏడు దఫాలు ఈసెట్‌ను జేఎన్‌టీయూ నిర్వహించింది. తాజాగా ఎనిమిదో దఫా జేఎన్‌టీయూ(ఏ) నిర్వహిస్తోంది. ఇందులో ఆరు దఫాలు ప్రొఫెసర్‌ పీఆర్‌ భానుమూర్తి ఈసెట్‌ కన్వీనర్‌గా ఉన్నారు. తాజాగా ఏడో దఫా కూడా రాష్ట్ర కన్వీనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఘనత ఆయనకే దక్కింది. ఈసెట్‌ రాష్ట్ర కన్వీనర్‌ భానుమూర్తి నూతన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.

Also Read : 689 Job Openings in Andhra Pradesh!

తనపై నమ్మకం ఉంచి ఈసెట్‌ కన్వీనర్‌గా బాధ్యతలు అప్పగించిన ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి, జేఎన్‌టీయూఏ వీసీ జీవీఆర్‌ శ్రీనివాసరావు, రెక్టార్‌ ఎం.విజయకుమార్‌, రిజిస్ట్రార్‌ సి.శశిధర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జేఎన్‌టీయూఏ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్వీ సత్యనారాయణ, పాలకమండలి సభ్యుడు డాక్టర్‌ ఎం. రామశేఖర్‌రెడ్డి, డాక్టర్‌ దిలీప్‌కుమార్‌, డిప్యూటీ రిజిస్ట్రార్‌ మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.

Published date : 07 Feb 2024 10:28AM

Photo Stories