Skip to main content

TS Eamcet Notification 2023 Details : టీఎస్ ఎంసెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ముఖ్యమైన తేదీలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్‌ మెడికల్ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు నిర్వ‌హించే టీఎస్ ఎంసెట్ నోటిఫికేష‌న్‌ను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఫిబ్ర‌వ‌రి 28వ తేదీ (మంగ‌ళ‌వారం) విడుదల చేసింది.
TS EAMCET 2023 Notification Details Telugu
TS EAMCET 2023 Notification

ఈ సారి కూడా టీఎస్ ఎంసెట్‌ను జేఎన్‌టీయూహెచ్ నిర్వ‌హించ‌నున్న‌ది. విద్యార్థులు మార్చి 3వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మే 7 నుంచి 11 వరకు పరీక్ష నిర్వ‌హించ‌నున్నారు.

TS EAMCET - QUICK REVIEW | BIT BANK | GUIDANCE | MODEL PAPERS | PREVIOUS PAPERS | PRACTICE QUESTIONS

ఈ ప‌రీక్ష ద్వారా 2023 విద్యా సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీలు, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్, అఫిలియేటెడ్‌ ప్రొఫెషనల్‌ కాలేజీల్లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రొఫెషనల్ ఇంజినీరింగ్‌, అగ్రిక‌ల్చ‌ర్‌, మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. 

ప్రవేశాలు కల్పించే కోర్సుల వివరాలు ఇవే..:ts eamcet 2023 notification details
బీఈ, బీటెక్‌/ బీటెక్ (బయో-టెక్నాలజీ)/ బీటెక్ (డెయిరీ టెక్నాలజీ)/ బీటెక్ (అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్)/ బీఫార్మసీ/ బీటెక్‌(ఫుడ్ టెక్నాలజీ)/ బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్/ బీఎస్సీ(ఆనర్స్) హార్టికల్చర్/ బీఎస్సీ(ఫారెస్ట్రీ)/బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌/ బీఎఫ్‌ఎస్సీ.

➤ ఫార్మ్-డి.
➤ బీఎస్సీ(నర్సింగ్).

అర్హత ఇవే..: 
ఇంటర్మీడియట్‌(ఎంపీసీ/ బైపీసీ)లో ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు తప్పనిసరి. బీఎస్సీ నర్సింగ్‌లో చేరాలనుకున్న విద్యార్థులు ఎంసెట్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ విభాగం పరీక్ష రాయాల్సి ఉంటుంది.

చదవండి: EAMCET 2023: ఈసారి ఎంసెట్‌కు ఇంత శాతం సిలబస్‌ మాత్రమే

పరీక్ష కేంద్రాలు ఇవే :

తెలంగాణలో 16 పరీక్షా జోన్లు ఏర్పాటు చేశారు. ఏపీలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు నగరాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తారు.

ప‌రీక్ష ఫీజు : 
రూ.900 (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌ అభ్యర్థులకు రూ.500). రెండు స్ట్రీమ్‌లకు రూ.1,800(ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌ అభ్యర్థులకు రూ.1000) గా ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

చదవండి: ఎంసెట్‌ - న్యూస్ | గైడెన్స్ | గెస్ట్ కాలమ్

ముఖ్యమైన తేదీలు ఇవే :
➤ మార్చి 3- ఏప్రిల్‌ 10 వరకు : ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తుల సమర్పణ ఉంటుంది.
➤ ఏప్రిల్‌ 12-14 వరకు : దరఖాస్తుల్లో తప్పుల సవరణకు అవకాశం కల్పిస్తారు.
➤ ఏప్రిల్‌ 15- మే 2 వరకు : రూ.250 నుంచి రూ.5 వేల వరకు ఆలస్య రుసుముతో దరఖాస్తుకు అవకాశం ఉంటుంది.
➤ ఏప్రిల్‌ 30 నుంచి : డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయి.
➤ ఎంసెట్‌ పరీక్షలు : మే 7, 8, 9 తేదీల్లో ఇంజినీరింగ్‌; 10, 11 తేదీల్లో అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ పరీక్షలు నిర్వహిస్తారు.
➤ పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ : https://eamcet.tsche.ac.in/

టీఎస్ ఎంసెట్ 2023 నోటిఫికేష‌న్ పూర్తి వివ‌రాలు ఇవే..
 

Published date : 28 Feb 2023 07:04PM
PDF

Photo Stories