Skip to main content

EAMCET 2023: దరఖాస్తుల వరద.. ఇన్ని వేల దరఖాస్తులు ఇతర రాష్ట్రాల నుంచి..

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
ts eamcet 2023 applications details
ఎంసెట్ కు దరఖాస్తుల వరద.. ఇన్ని వేల దరఖాస్తులు ఇతర రాష్ట్రాల నుంచి..

ఇప్పటి వరకూ మొత్తం 1,23,780 దరఖాస్తులు అందినట్టు ఎంసెట్‌ కన్వీనర్‌ డీన్‌ కుమార్‌ తెలిపారు. ఇందులో 79,420 మంది ఇంజనీరింగ్‌ విభాగానికి, 44,230 మంది అగ్రికల్చర్, మెడికల్‌ విభాగానికి జరిగే ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకున్నట్టు వెల్లడించారు. ఇంజనీరింగ్, మెడికల్‌ రెండు విభాగాలకూ 130 మంది దరఖాస్తు చేసుకున్నట్టు పేర్కొన్నారు.

చదవండి: ఎంసెట్‌ - న్యూస్ | గైడెన్స్ | గెస్ట్ కాలమ్

2022లో 1,61,552 మంది ఇంజనీరింగ్‌కు, 88,156 మంది మెడికల్, అగ్రికల్చర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. మార్చి 3వ తేదీ నుంచి ఎంసెట్‌కు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఏప్రిల్‌ 10 వరకూ గడువుండటంతో దరఖాస్తులు 2022లో వచ్చిన సంఖ్యను మించిపోతాయని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకూ ఇతర రాష్ట్రాలకు చెందిన 10 వేల మంది దరఖాస్తు చేసినట్టు తెలిపారు. ఎంసెట్‌ పరీక్షలు మే 7 నుంచి 11 వరకూ జరుగుతాయి.

Also Read: EAMCET - QUICK REVIEW | BIT BANK | GUIDANCE | MODEL PAPERS | PREVIOUS PAPERS | PRACTICE QUESTIONS

Published date : 21 Mar 2023 03:33PM

Photo Stories