TS EAMCET 2022(Agriculture) : బ్రేకింగ్ న్యూస్.. వాయిదా పడ్డ అగ్రికల్చర్ పరీక్షల తేదీలు ఇవే..
ఈ వాయిదా పడ్డ ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షల తేదీలను తెలంగాణ ఉన్నత విద్యామండలి జూలై 19వ తేదీన ప్రకటించింది. TS EAMCET 2022(Agriculture) పరీక్షల తేదీలు జూలై 30, 31వ తేదీన జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యామండలి ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే జూలై 18 నుంచి 20 వరకు జరగాల్సిన ఇంజినీరింగ్ ఎంసెట్ యథాతథంగా జరుగుతున్న విషయం తెల్సిందే.
ఎంసెట్ స్టడీమెటీరియర్, సిలబస్, మోడల్‌పేపర్స్, ప్రీవియస్ పేపర్స్ కోసం క్లిక్ చేయండి
ఈ సారి విపరీతమైన పోటీ..
ఈసారి తెలంగాణ ఎంసెట్‌కు కూడా విపరీతమైన పోటీ ఉంది. ఇంజనీరింగ్‌కు 1,71,945, అగ్రికల్చర్, మెడికల్‌కు 94,150, రెండింటికీ దరఖాస్తు చేసినవారు 350, మొత్తం 2,66,445 దరఖాస్తులు వచ్చాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి 14,722 దరఖాస్తులు ఎక్కువ వచ్చాయి.
సవరించిన పరీక్షల తేదీలు ఇవే..
1. టీఎస్ ఎంసెట్ (అగ్రికల్చర్&మెడికల్)-జులై 30, 31 తేదీల్లో..
➤ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు
➤ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు
2. టీఎస్ ఈసెట్ ఆగస్టు 1న
☛ ఉదయం 9 నుంచి 12 మధ్యాహ్నం వరకు
☛ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు
3. టీఎస్ పీజీఈసెట్- ఆగస్టు 2 నుంచి 5 వరకు
➤ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు
➤ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు
ఎంసెట్ స్టడీమెటీరియర్, సిలబస్, మోడల్‌పేపర్స్, ప్రీవియస్ పేపర్స్ కోసం క్లిక్ చేయండి
Engineering Admissions: బీటెక్‌లో ప్రవేశాలకు సిద్ధమవుతున్నారా... అయితే ఇది మీ కోసమే!