Skip to main content

TGEAPCET 2024 Second Phase Seat Allotment : బ్రేకింగ్ న్యూస్‌.. ఇంజినీరింగ్‌ రెండో విడత సీట్ల కేటాయింపు.. ఇక మిగిలిన సీట్లుకు..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లో ప్ర‌స్తుతం ఇంజ‌నీరింగ్ ప్ర‌వేశాల ప్ర‌క్రియ జ‌రుగుతున్న విష‌యం తెల్సిందే. ఇప్ప‌టికే మొద‌టి విడ‌త ఇంజ‌నీరింగ్ సీట్లల‌ను కేటాయించారు.
Engineering seat allotment process in Telangana  Telangana engineering counseling July 31st  Telangana Council of Higher Education seat allotment  Engineering admission process in Telangana Second batch of engineering counseling completed in Telangana

తాజాగా జూలై 31వ తేదీన ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్‌ పూర్తయింది. ఈ మేరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చిన విద్యార్థుల ర్యాంకులకు అనుగుణంగా సీట్ల కేటాయింపు ప్రక్రియను తెలంగాణ ఉన్నత విద్యామండలి అధికారులు పూర్తి చేశారు.

మొత్తం ఇంజ‌నీరింగ్ సీట్ల‌ల‌లో.. 
ఇంజ‌నీరింగ్ రెండు రౌండ్లలో కలిపి 81,490 సీట్ల కేటాయింపు పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా 5,019 సీట్లు అందుబాటులో ఉన్నట్లు ఈఏపీసెట్‌ అడ్మిషన్స్‌ కన్వీనర్‌ కన్వీనర్ శ్రీదేవసేన ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 175 ఇంజినీరింగ్ విద్యాసంస్థలు ఉన్నాయి. మొత్తం 86,509 ఇంజినీరింగ్ సీట్లు కన్వీనర్ కోటాలో ఉన్నాయి. 

వెబ్‌సైట్‌లో రెండో విడత సీట్లను చెక్ చేసుకోండిలా..
ఇంజ‌నీరింగ్ రెండో విడత సీట్ల కేటాయింపు వివరాలు https://tgeapcet.nic.in/college_allotment.aspx అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. రెండో విడతకు ఎంపికైన వారు ట్యూషన్‌ ఫీజు పేమెంట్‌, వెబ్‌సైట్‌ ద్వారా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌కు ఆగస్టు 1వ తేదీ నుంచి 2వ తేదీ వరకు గడువు ఇచ్చారు. టీఎస్ఈఏపీసెట్‌-2024 కౌన్సెలింగ్‌ ద్వారా బీటెక్‌ సీట్లు పొందిన విద్యార్థులు చివరి విడత కౌన్సెలింగ్‌ పూర్తయ్యాకే స్వయంగా ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాలని విద్యాశాఖ స్పష్టం చేసింది.ఇంతకముందు ప్రకటించిన మాదిరిగా రెండో విడత సీట్ల కేటయింపు తర్వాత రిపోర్టు చేయవద్దని ఎప్‌సెట్‌ ప్రవేశాల కమిటీ కన్వీనర్‌ శ్రీదేవసేన తెలిపారు. దీంతో కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు తుది విడత కౌన్సెలింగ్‌  ప్రక్రియ పూర్తయ్యాకే కళాశాలల్లో వ్యక్తిగతంగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంద‌న్నారు.

Published date : 01 Aug 2024 09:59AM

Photo Stories