ప్రశాంతంగా తొలిరోజు టీఎస్ ఎంసెట్– 2021 పరీక్ష.. పేపర్ ఎలా ఉందంటే..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్–21 పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా ముగిశాయి.
ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు జరిగాయి. మొత్తం 2,51,606 మంది దరఖాస్తు చేసుకోగా, ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో 1,64,962 మంది, అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్‌లో 86,644 మంది ఉన్నారు. తెలంగాణలో 82 సెంటర్లు, ఆంధ్రప్రదేశ్‌లో 23 సెంటర్లలో పరీక్ష ప్రారంభమైంది. బుధవారం54,983 మంది విద్యార్థులకు పరీక్షలకు అనుమతి ఇవ్వగా, 50,134 మంది హాజరయ్యారు. తొలిరోజు 91.18 హాజరుశాతం నమోదనట్లు సెట్ కన్వీనర్ ఎ.గోవర్ధన్ తెలిపారు. స్వల్ప సాంకేతిక సమస్యల కారణంగా ఒకట్రెండు చోట్ల పరీక్ష ప్రారంభంలో కొంత జాప్యం జరిగినట్లు విద్యార్థులు తెలిపారు.
గతేడాది కంటే సులువే..
ఎంసెట్ తొలి రోజు పరీక్షలో ఇంటర్ ఫస్టియర్ నుంచి ఎక్కువ ప్రశ్నలు, సెకండీయర్ నుంచి తక్కువగా వచ్చినట్లు విద్యా నిపుణులు అంటున్నారు. రెండు సెషన్ల పరీక్షలో ప్రశ్నలు గతేడాది కంటే కాస్తంత సులువుగానే ఉన్నట్లు చెబుతున్నారు.

Published date : 05 Aug 2021 03:39PM