Skip to main content

Engineering: మెరిట్ విద్యార్థులకే... ‘బీ’ కేటగిరీ సీట్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేట్ అన్ ఎయిడెడ్, నాన్ మైనార్టీ ఇంజనీరింగ్, తదితర ప్రొఫెషనల్ కాలేజీల్లోని ‘బీ’ కేటగిరీ (యాజమాన్య) కోటా సీట్లు కూడా ఇక మెరిట్ విద్యార్థులకు దక్కనున్నాయి.
Engineering
Engineering

సీట్లను ప్రభుత్వమే కన్వీనర్ద్వారా భర్తీ చేయించనుంది. విద్యా సంవత్సరం నుంచే ఇది అమల్లోకి రానుంది. మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గతంలోబీకేటగిరీ సీట్లను ఆయా కాలేజీలు ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోకుండా ఇష్టానుసారం భర్తీ చేసుకునేవి. ఎక్కువ ఫీజులు చెల్లించేవారికి మాత్రమే సీట్లను కట్టబెట్టేవి. దీనివల్ల మెరిట్విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లేది. గత టీడీపీ ప్రభుత్వం సీట్లను మెరిట్విద్యార్థులకు కేటాయించాలన్న ఆలోచన కూడా చేయలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాకబీకేటగిరీ సీట్లను మెరిట్ప్రాతిపదికన.. పారదర్శకంగా కన్వీనర్ద్వారా భర్తీ చేయించేలా చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి గతేడాది జూలై 25 జీవో 25ను జారీ చేసింది. అయితే కరోనాతో అడ్మిషన్లు ఆలస్యం కావడం, ఇతర కారణాలతో కాలేజీ యాజమాన్యాల వినతి మేరకు వారే భర్తీ చేసుకునేందుకు అనుమతించింది. విద్యా సంవత్సరంలో మాత్రం కన్వీనర్ద్వారానే భర్తీ చేసేలా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్చంద్ర కొన్ని సవరణలతో తాజాగా జీవో 48 విడుదల చేశారు. దీని ప్రకారం.. యాజమాన్య కోటా సీట్లను కూడా కన్వీనర్నిర్వహించే వెబ్కౌన్సెలింగ్ద్వారా భర్తీ చేయనున్నారు. ఆయా కాలేజీల్లోని మొత్తం సీట్లలో 70 శాతం కన్వీనర్కోటా (‘కేటగిరీ) సీట్లు కాగా, 30 శాతం యాజమాన్య కోటా సీట్లు.

బీకేటగిరీ ఎన్ఆర్ సీట్ల భర్తీ ఇలా..

  • యాజమాన్య కోటా కింద ఉన్న 30 శాతం సీట్లలో 15 శాతం ఎన్ఆర్ కోటా, 15 శాతం నాన్ ఎన్ఆర్ కోటా కింద ఉంటాయి.
  • ఎన్ఆర్ కోటా సీట్లకు యాజమాన్యాలే నోటిఫికేషన్ ఇచ్చి ఎన్ఆర్ విద్యార్థులతో భర్తీ చేసుకోవచ్చు.
  • ఏపీ ఈఏపీసెట్అడ్మిషన్ల కౌన్సెలింగ్ప్రక్రియ ప్రారంభానికి ముందే అవి వాటిని భర్తీ చేయాలి. సీట్లను నిర్ణీత అర్హత పరీక్షల్లో 50% మార్కులు సాధించిన వారికే ఇవ్వాల్సి ఉంటుంది.
  • ఎన్ఆర్ విద్యార్థుల నుంచి కాలేజీలు 5 వేల అమెరికన్ డాలర్లను ఫీజుగా వసూలు చేసుకోవచ్చు. ఎన్ఆర్ కోటాలో భర్తీ కాని సీట్లనుబీకేటగిరీ నాన్ ఎన్ఆర్ కోటా సీట్లుగా పరిగణిస్తారు.

 

బీకేటగిరీ నాన్ ఎన్ఆర్ సీట్ల భర్తీ ఇలా..

  • ఆయా కాలేజీలుబీకేటగిరీలో భర్తీ కాకుండా మిగిలిపోయిన సీట్ల వివరాలను కన్వీనర్కు తెలియజేయాలి. వీటిని ఏపీ ఈఏపీసెట్ప్రవేశాల కన్వీనర్వెబ్కౌన్సెలింగ్ద్వారా భర్తీ చేస్తారు.
  • రాష్ట్ర విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సిఫార్సుల మేరకు.. ఆయా కాలేజీల్లోని కోర్సుల వారీగా.. ‘కేటగిరీ సీట్లకు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుకు గరిష్టంగా మూడు రెట్ల వరకు ఆయా యాజమాన్యాలు వసూలు చేసుకోవచ్చు.
  • సీట్లు లభించిన విద్యార్థులు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలకు అర్హులు కారు.
  • విద్యార్థులు వెబ్కౌన్సెలింగ్లోకేటగిరీ, ‘బీకేటగిరీ నాన్ ఎన్ఆర్ సీట్లకు వేర్వేరుగా ఆప్షన్లు ఇవ్వాలి.
  • కేటగిరీతోపాటుబీకేటగిరీ సీట్లను కూడా కన్వీనర్ఒకే సమయంలో మెరిట్ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
  • బీకేటగిరీ నాన్ ఎన్ఆర్ సీట్లకు ఎంపికైనవారు ఏపీ ఈఏపీసెట్లో మెరిట్సాధించి ఉంటేకేటగిరీ సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • బీకేటగిరీ నాన్ ఎన్ఆర్ సీట్లకు ముందుగా జేఈఈ, తర్వాత ఏపీ ఈఏపీసెట్మెరిట్ను ప్రాధాన్యతగా తీసుకుంటారు.
  • కన్వీనర్ద్వారా మిగిలిపోయే సీట్లను ఆయా కాలేజీలు స్పాట్అడ్మిషన్ల కింద నిర్ణీత అర్హతలున్న వారితో భర్తీ చేసుకోవచ్చు. దీనికి సంబంధిత అధికారుల ఆమోదం తప్పనిసరి.
Published date : 06 Sep 2021 01:03PM

Photo Stories