Skip to main content

TS EAPCET 2024: ఈసారి ఇంకా ఆలస్యంగా టీఎస్‌ఈఏపీ కౌన్సెలింగ్‌!.. ఆలస్యానికి కారణాలు ఇవే..

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి కౌన్సెలింగ్‌ ఈ ఏడాది మరింత ఆలస్యమయ్యేలా కన్పిస్తోంది.
TS EAPCET 2024 counseling is still late

ప్రైవేటు కాలేజీలకు అనుబంధ గుర్తింపు ప్రక్రియ ఇప్పటికీ మొదలవ్వకపోవడం ఈ అనుమానా లకు తావిస్తోంది. ఇంజనీరింగ్‌కు సంబంధించిన కొన్ని బ్రాంచీల్లో సీట్ల పెంపునకు పెద్ద ఎత్తున దరఖాస్తులొచ్చాయి. మరికొన్ని బ్రాంచీల్లో సీట్ల కుదింపును కాలేజీలు కోరుకుంటున్నాయి. వీట న్నింటిపైనా అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
ఒకవేళ సీట్లపై స్పష్టత వచ్చినప్పటికీ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు కాలేజీలకు అను బంధ గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం యూనివర్సిటీ బృందాలు కాలే జీలను సందర్శించాల్సి ఉంటుంది. మౌలిక వస తులు ఏ మేరకు ఉన్నాయి? ఫ్యాకల్టీ పరిస్థితి ఏమిటి? అనే అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది.

అన్ని అర్హతలు ఉన్నప్పుడు మాత్రమే అనుబంధ గుర్తింపు ఇస్తారు. అప్పుడే కాలేజీలు కౌన్సెలింగ్‌లో పాల్గొనే వీలుంటుంది. కానీ ఇప్ప టివరకు ఇందుకు సంబంధించిన సమావేశమే జరగలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. 

చదవండి: Sakshi EAPCET & NEET Grand Mock Test 2024 Click here for Registration

ఆలస్యానికి కారణాలేంటి?

రాష్ట్ర ఈఏపీసెట్‌ మే 7వ తేదీ నుంచి మొదలై 11తో ము గుస్తుంది. నెల రోజుల్లో ఫలి తాలు వెల్లడిస్తారు. అదే రోజు కౌన్సెలింగ్‌ తేదీలనూ ప్రకటిస్తారు. కౌన్సెలింగ్‌ మొదలయ్యే నాటికి రాష్ట్రంలోని 175 కాలేజీల్లో ఉండే కన్వీనర్‌ కోటా సీట్లను బ్రాంచీల వారీగా వెల్లడించాల్సి ఉంటుంది.

గత ఏడాది లెక్కల ప్రకారం 90 వేలకు పైగా ఇంజనీరింగ్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. గత ఏడాది మొత్తం 14 వేల సీట్లు కంప్యూటర్‌ సైన్స్‌ బ్రాంచీల్లో పెరిగాయి. ఈ ఏడాది కూడా మరి కొన్ని సీట్లు పెంచాలని కాలేజీలు కోరుతు న్నాయి. గత ఏడాది తనిఖీల ప్రక్రియపై ఆరో పణలు వచ్చాయి.

చదవండి: College Predictor - 2023 - AP EAPCET TS EAMCET

మౌలిక వసతులు, సరైన అధ్యాపకులు లేకుండా అనుబంధ గుర్తింపు ఇచ్చి నట్టు కొన్ని వర్సిటీలపై విమర్శలు వచ్చాయి. దీంతో ఈసారి ప్రత్యేక బృందాలను నియమించాలని నిర్ణయించారు. వసతులు లేని కాలేజీల్లో కంప్యూటర్‌ సైన్స్‌ బ్రాంచి సీట్ల కుదింపు అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్‌ ఆల స్యమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. అయితే కౌన్సెలింగ్‌ సకాలంలోనే జరుగుతుందని భావిస్తు న్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి తెలిపారు.  

Published date : 06 Apr 2024 09:17AM

Photo Stories