Skip to main content

నేటి నుంచి తెలంగాణ ఎంసెట్‌– 2021 పరీక్షలు.. సెల్ఫ్‌ డిక్లరేషన్‌ తప్పనిసరి..

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్‌ ప్రవేశ పరీక్షలు బుధవారం ప్రారంభం కానున్నాయి. 4, 5, 6, 9, 10 తేదీల్లో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు పరీక్షలు ఉంటాయి.
4, 5, 6 తేదీల్లో ఇంజనీరింగ్, 9, 10 తేదీల్లో వ్యవసాయ, మెడికల్‌ విద్యార్థుల కోసం పరీక్షలు ఉంటాయి. ఎంసెట్‌కు మొత్తం 2,51,606 మంది దరఖాస్తు చేసుకొన్నారు. వీరిలో ఇంజనీరింగ్‌ 1,64,962 మంది, అగ్రి, మెడికల్‌ ఎంట్రన్స్‌ రాస్తున్న విద్యార్థులు 86,644 మంది ఉన్నారు. తెలంగాణలో 82, ఆంధ్రప్రదేశ్‌లో 23 సెంటర్లలో పరీక్షలు జరుగుతాయి. ఈసారి హాల్‌ టికెట్‌తోపాటు పరీక్ష కేంద్రం రూట్‌మ్యాప్‌ను కూడా ఇచ్చారు. నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులను రెండు గంటల ముందు నుంచే పరీక్ష ప్రాంగణంలోకి అనుమతిస్తారు. గంటంబావు ముందు నుంచి పరీక్ష హాల్‌లోకి అనుమతిస్తారు.

కోవిడ్‌ నిబంధనలు తప్పనిసరి..
కోవిడ్‌కు సంబంధించి ప్రతి విద్యార్థి సెల్ప్‌ డిక్లరేషన్‌ఫారం ఇవ్వాలి. జ్వరం, జలుబు వంటివి ఉన్నవారికి ప్రత్యేక ఏర్పాటు చేస్తారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి. తమ వెంట శానిటైజర్, 500 మిల్లీలీటర్ల వాటర్‌ బాటిల్‌ తెచ్చుకోవచ్చు.

చ‌ద‌వండి: ఈ ఆగస్టు నెలంతా ప్రవేశ పరీక్షలే.. రేపటి నుంచి ఎంసెట్ – 2021 పరీక్షలు..

చ‌ద‌వండి: గత మూడు నెలల్లో 11 శాతం నియామకాలు పెరిగాయ్!!

చ‌ద‌వండి: అటెండెన్స్ మినహాయింపు ఫీజు గడువు ఆగస్టు 8 వరకు..: ఇంటర్ బోర్డు
Published date : 04 Aug 2021 03:32PM

Photo Stories