మార్చి 18న టీఎస్ ఎంసెట్– 2021 నోటిఫికేషన్!
Sakshi Education
సాక్షి,హైదరాబాద్: ఎంసెట్ నోటిఫికేషన్ మార్చి 18న విడుదలయ్యే అవకాశం ఉంది. దరఖాస్తులను ఈనెల 20 నుంచి స్వీకరించేందుకు సెట్ కమిటీ కసరత్తు చేస్తోంది. వీటిపై ఈనెల 6న జరిగే ఎంసెట్ కమిటీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.
తెలంగాణ ఎంసెట్ 2021 నోటిఫికేషన్ షెడ్యూల్, సిలబస్, ఎగ్టామ్ ప్యాట్రన్, మోడల్ పేపర్స్, స్టడీ మెటీరియల్, మాక్ టెస్ట్స్, గైడెన్స్... ఇతర తాజా అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి.
అలాగే పరీక్షల షెడ్యూల్‌ను కూడా ఖరారు చేయనున్నారు. ముందుగా అగ్రికల్చర్ ఎంసెట్ నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఇంజనీరింగ్ ఎంసెట్‌ను నిర్వహించేలా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జూలై 3న జేఈఈ అడ్వాన్స్ పరీక్ష ఉన్నందున విద్యార్థులకు ఎక్కువ సమయం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకోనున్నారు. జూలై 5, 6 తేదీల్లో అగ్రికల్చర్ ఎంసెట్, 7, 8, 9 తేదీల్లో ఇంజనీరింగ్ ఎంసెట్ నిర్వహించేలా షెడ్యూల్ ఖరారు చేయనున్నారు. ఈసారి తెలంగాణలో 2 టెస్ట్ జోన్లను అదనంగా (భద్రాచలం, హైదరాబాద్ సౌత్) పెంచనున్నారు.

Published date : 06 Mar 2021 04:22PM