Skip to main content

EAMCET 2023: టాపర్లలో ఏపీ అబ్బాయిలు.. టాప్‌ 10 ర్యాంకర్లు వీరే..

సాక్షి, హైదరాబాద్‌: ఎంసెట్‌లో టాప్‌ ర్యాంకులు సాధించిన వారిలో ఎక్కువ మంది అబ్బాయిలే ఉన్నారు.
EAMCET 2023
టాపర్లలో ఏపీ అబ్బాయిలు.. టాప్‌ 10 ర్యాంకర్లు వీరే..

అగ్రి–మెడికల్, ఇంజనీరింగ్‌ రెండు విభాగాల్లోనూ అబ్బాయిలే టాప్‌ ర్యాంకుల్లో నిలిచారు. ఇక టాప్‌ ర్యాంకర్లలో ఏపీకి చెందినవారు ఎక్కువగా ఉన్నారు. ఇంజనీరింగ్‌లో టాప్‌–10లో ఏపీకే 8 ర్యాంకులు, అగ్రి–మెడికల్‌ ఎంసెట్‌లో ఏడుగురు ఏపీ విద్యార్థులు నిలిచారు. 

చదవండి: Artificial Intelligence: కృత్రిమ మేధ విసరనున్న సవాళ్లు.. ఇప్పుడు చర్చ మొత్తం భద్రత పైనే..

ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌లో.. 

పేరు

జిల్లా

1. సనపల అనిరుధ్‌

విశాఖ (ఏపీ)

2. యెక్కంటి ఫణి వెంకట మణిందర్‌రెడ్డి

గుంటూరు (ఏపీ)

3. చల్లా ఉమేశ్‌ వరుణ్‌

నందిగామ, కృష్ణా (ఏపీ)

4. అభినీత్‌ మాజేటి

రంగారెడ్డి (తెలంగాణ)

5. పొన్నతోట ప్రమోద్‌కుమార్‌రెడ్డి

అనంతపురం (ఏపీ)

6. మరడాన ధీరజ్‌కుమార్‌

విశాఖ (ఏపీ)

7. వడ్డే శాన్వితరెడ్డి

నల్గొండ (తెలంగాణ)

8. బోయిన సంజన

శ్రీకాకుళం (ఏపీ)

9. ప్రిన్స్‌ బ్రాన్హంరెడ్డి

నంద్యాల (ఏపీ)

10. మీసాల ప్రణతి శ్రీజ

విజయనగరం (ఏపీ)

అగ్రి, మెడికల్‌ విభాగంలో..

పేరు    

జిల్లా

1. బూరుగుపల్లి సత్యరాజ్‌ జశ్వంత్‌

తూర్పుగోదావరి (ఏపీ)

2. నాసిక వెంకట తేజ

ప్రకాశం (ఏపీ)

3. సఫల్‌లక్ష్మి పసుపులేటి

రంగారెడ్డి (తెలంగాణ)

4. దుర్గెంపూడి కార్తికేయరెడ్డి

గుంటూరు (ఏపీ)

5. బోర వరుణ్‌ చక్రవర్తి

శ్రీకాకుళం (ఏపీ)

6. దేవగుడి గురు శశిధర్‌రెడ్డి

రంగారెడ్డి (తెలంగాణ)

7. వంగీపురం హర్షల్‌ సాయి

నెల్లూరు (ఏపీ)

8. దద్దనాల సాయి చిద్విలాస్‌రెడ్డి

గుంటూరు (ఏపీ)

9. గంధమనేని గిరి వర్షిత

అనంతపురం (ఏపీ)

10. కొల్లాబత్తుల ప్రీతం సిద్ధార్థ్‌

హైదరాబాద్‌ (తెలంగాణ)

కార్డియాలజిస్ట్‌ అవుతా.. 
మాది రాజమహేంద్రవరం దగ్గర కాతేరు. నాన్న బూరుగుపల్లి సాయిరామకృష్ణ రైతు, అమ్మ రజని గృహిణి. ఇంటర్‌ బైపీసీలో 985 మార్కులు వచ్చాయి. నీట్‌లోనూ మంచి ర్యాంకు సాధిస్తానన్న నమ్మకం ఉంది. మంచి వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ చదివి కార్డియాలజీలో స్పెషలైజేషన్‌ చేస్తా. 
– బూరుగుపల్లి సత్యరాజ్‌ జశ్వంత్, 1వ ర్యాంకర్‌ (అగ్రి, మెడికల్‌ స్ట్రీమ్‌) 
వైద్య రంగంలో ఉన్నత విద్యనభ్యసిస్తా.. 
మాది చీరాల. నాన్న సుధాకర్‌బాబు, అమ్మ శ్రీదేవి మగ్గం నేస్తారు. విజయవాడలోని ప్రైవేటు కాలేజీలో ఇంటర్‌ చదివాను. వైద్య రంగంలో ఉన్నత విద్య అభ్యసించడమే నా లక్ష్యం.     
    – నాసిక వెంకట తేజ, 2వ ర్యాంకర్‌ (అగ్రి, మెడికల్‌ స్ట్రీమ్‌) 
డాక్టరై పేదలకు సేవ చేయాలన్నదే లక్ష్యం 
పేదలకు ఉచిత వైద్యం అందించాలన్నది నా లక్ష్యం. గుండె వైద్య నిపుణుడిగా సేవలు చేస్తా..తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఈ విజయం సాధించాను. మాది ఉమ్మడి నల్గొండ జిల్లా కోదాడ. నాన్న శ్రీచరణ్‌ వైద్యుడు, అమ్మ శ్రీదేవి. హైదరాబాద్‌లోని ఆర్‌కేపురం హరిపురికాలనీలో ఉంటున్నాం. 
– పసుపులేటి సఫల్‌ లక్ష్మి, 3వ ర్యాంకర్‌ (అగ్రి–మెడికల్‌ స్ట్రీమ్‌) 

కార్డియాలజీ లేదా న్యూరాలజీ చేస్తా.. 
మాది తెనాలి. ఇంటర్‌ బైపీసీలో 983 మార్కులు వచ్చాయి. వైద్య రంగంలో స్థిరపడాలనేది నా ఆకాంక్ష. ఇప్పటికే నీట్‌ రాశాను. ఎంబీబీఎస్‌ చేసి ఆ తర్వాత కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్‌ లేదా గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌గా స్థిరపడాలనేదే నా కోరిక. 
– దుర్గెంపూడి కార్తికేయరెడ్డి, 4వ ర్యాంకర్‌ (అగ్రి, మెడికల్‌ స్ట్రీమ్‌) 
వైద్య రంగంలో స్థిరపడతా.. 
మాది శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట. అమ్మానాన్న ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. నీట్‌లోనూ మంచి ర్యాంకు వస్తుందనే నమ్మకం ఉంది. వైద్య రంగంలో స్థిరపడాలనేది నా కోరిక. 
– బోర వరుణ్‌ చక్రవర్తి, 5వ ర్యాంకర్‌ (అగ్రి, మెడికల్‌ స్ట్రీమ్‌) 
ఎంబీబీఎస్‌ చదివి ప్రజలకు సేవ చేస్తా.. 
6వ ర్యాంకు రావడంతో సంతోషంగా ఉంది. నీట్‌ ర్యాంకు సాధించి ఎంబీబీఎస్‌ పూర్తి చేస్తా. వైద్యుడిగా పేద ప్రజలకు సేవ చేయాలని ఉంది. హైదరాబాద్‌లోని మూసాపేట డివిజన్‌ శివశక్తి నగర్‌లో ఉంటున్నాం. అమ్మానాన్న ఇద్దరూ ఉద్యోగులే. అమ్మ ప్రోత్సాహంతోనే బాగా చదివా..     
    – గురు శశిధర్‌రెడ్డి, 6వ ర్యాంకు (అగ్రి, మెడికల్‌ స్ట్రీమ్‌) 
మంచి వైద్య కళాశాలలో మెడిసిన్‌ చేస్తా..  
మాది నెల్లూరు. అమ్మానాన్న హారతి, శంకర్‌ వైద్యులుగా పనిచేస్తున్నారు. మంచి మెడికల్‌ కళాశాలలో మెడిసిన్‌ చదవడమే నా లక్ష్యం.     
    – వి. హర్షల్‌ సాయి, 7వ ర్యాంకర్‌ (అగ్రి, మెడికల్‌ స్ట్రీమ్‌) 

కష్టపడి చదివా.. 
మాది గుంటూరులోని ఏటీ అగ్రహారం. అమ్మానాన్న ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. కష్టపడి చదవడంతో తెలంగాణ ఎంసెట్‌లో ఎనిమిదో ర్యాంక్‌ సాధించాను.  
    – డి. సాయి చిద్విలాస్‌రెడ్డి, 8వ ర్యాంకర్‌ (అగ్రి, మెడికల్‌ స్ట్రీమ్‌)
కష్టపడి చదివా.. ర్యాంకు సాధించా  
అటు ఇనిస్టిట్యూట్‌లో, ఇటు ఇంట్లో రోజుకు పది గంటలకుపైగా కష్టపడి చదివాను. ర్యాంకు వస్తుందని ముందే ఊహించాను. 10వ ర్యాంకు వచ్చినందుకు సంతోషంగా ఉంది. 
– కె. ప్రీతమ్‌ సిద్ధార్థ్,  10వ ర్యాంకర్‌ (అగ్రి, మెడికల్‌ స్ట్రీమ్‌) 

ఐఐటీ–బాంబేలో ఇంజనీరింగ్‌ చేస్తా.. 
మాది శ్రీకాకుళం జిల్లాలోని దిమిలాడ. ఇటీవల జేఈఈ మెయిన్‌లో ఆలిండియాలో 122వ ర్యాంకు వచ్చింది. నాన్న ఖగేశ్వరరావు విశాఖపట్నంలో ఎస్సైగా పనిచేస్తున్నారు. అమ్మ ఝాన్సీ గృహిణి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు సాధించి.. ఐఐటీ బాంబేలో కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజనీరింగ్‌ చేస్తా.     
    – సనపల అనిరుధ్, 1వ ర్యాంకర్‌ (ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌)  
కంప్యూటర్స్‌ సైన్స్‌ చదువుతా.. 
మాది గుంటూరు. నాన్న శ్రీనివాసరెడ్డి రైతు. ఇంటర్‌ ఎంపీసీలో 971 మార్కులు వచ్చాయి. జేఈఈ అడ్వాన్స్‌లో ర్యాంక్‌ సాధించి ఐఐటీ బాంబేలో సీటు సాధించడమే లక్ష్యం.   
– యెక్కంటి ఫణి వెంకట మణిందర్‌రెడ్డి, 2వ ర్యాంకర్‌ (ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌) 
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకే లక్ష్యం 
మాది ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ. ఇంటర్‌ ఎంపీసీలో 983 మార్కులు సాధించాను. ఇటీవల జేఈఈ మెయిన్‌ ఓపెన్‌ కేటగిరీలో 263వ ర్యాంక్‌ వచ్చింది. అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమవుతున్నా. అందులో మంచి ర్యాంక్‌ సాధించడమే లక్ష్యం. 
– చల్లా ఉమేశ్‌ వరుణ్, 3వ ర్యాంకర్‌ (ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌) 

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అవుతా.. 
4వ ర్యాంకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కావాలన్నది నా లక్ష్యం. మా నాన్న శశిధర్, అమ్మ క్రాంతికుమారిల ప్రోత్సాహంతో ఈ విజయం సాధించగలిగాను. 
– అభినీత్‌ మాజేటి, 4వ ర్యాంకర్‌ (ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌) 
సివిల్స్‌ సాధించి ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం 
మాది అనంతపురం జిల్లా తాడిపత్రి. ఇటీవల జేఈఈ మెయిన్‌లో ఆలిండియాలో 97వ ర్యాంకు సాధించాను. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లోనూ ర్యాంకు సాధించి ఐఐటీ బాంబేలో చేరతా. తర్వాత సివిల్స్‌ రాసి ప్రజలకు సేవ చేయాలన్నదే నా లక్ష్యం.  
– పొన్నతోట ప్రమోద్‌ కుమార్‌రెడ్డి, 5వ ర్యాంకర్‌ (ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌)  
ఐఐటీ బాంబేలో చేరుతా 
మాది విశాఖ జిల్లా గాజువాక. నాన్న వ్యాపారి. అమ్మ ఫార్మా సిస్టు. జేఈఈ అడ్వాన్స్‌ డ్‌లో ర్యాంకు సాధించి ఐఐటీ బాంబేలో కంప్యూటర్‌ సైన్స్‌లో చేరుతా.   

 – మరడాన ధీరజ్‌ కుమార్, 6వ ర్యాంకర్‌ (ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌) 

కంప్యూటర్‌ సైన్స్‌ చేయాలని ఉంది 
మాది నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలం బొమ్మకల్లు. ఇంటర్‌లో 977 మార్కులు వచ్చాయి. ఎంసెట్‌లో అత్యుత్తమ ర్యాంకు సాధించాలని ప్రణాళికాబద్ధంగా చదివా. కష్టానికి ఫలితం దక్కినందుకు సంతోషంగా ఉంది. ముంబై ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ చదవాలన్నది నా కోరిక. సివిల్స్‌ సాధించాలన్నది జీవిత లక్ష్యం. 
– వడ్డె శాన్వితరెడ్డి, 7వ ర్యాంకు (ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌) 
ఇంజనీరింగ్‌ చదువుతా.. 
మాది శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి. నాన్న గణేశ్‌ వ్యాపారి, అమ్మ జ్యోతి గృహిణి. జేఈఈ మెయిన్‌లో 729వ ర్యాంక్‌ సాధించా. అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమవుతున్నా. ఐఐటీ బాంబేలో ఇంజనీరింగ్‌లో చేరాలనేదే నా లక్ష్యం. 
– బోయిన సంజన, 8వ ర్యాంకర్‌ (ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌) 

కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ చేస్తా.. 
మాది నంద్యాల. ఇంటర్‌ ఎంపీసీలో 956 మార్కులు వచ్చాయి. జేఈ ఈ అడ్వాన్స్‌లో ర్యాంకు సాధించి మంచి ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌లో చేర తా. కంప్యూటర్‌ ఇంజనీర్‌ కావడమే లక్ష్యం. 
    – ప్రిన్స్‌ బ్రాన్హంరెడ్డి, 9వ ర్యాంకర్‌  (ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌) 

అడ్వాన్స్‌డ్‌లోనూ ర్యాంక్‌ సాధిస్తా.. 
మాది విజయనగరం జిల్లా గుర్ల. నాన్న అప్పలనాయుడు రైల్వే కానిస్టేబుల్, అమ్మ ప్రభుత్వ టీచర్‌. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంక్‌ సాధించి ఐఐటీ బాంబేలో చేరతా.

– మీసాల ప్రణతి శ్రీజ, 10వ ర్యాంకర్‌ (ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌)

Published date : 26 May 2023 03:14PM

Photo Stories