ఇంటి దగ్గరే ‘సాక్షి’ ఎంసెట్, నీట్ మాక్ టెస్టులు.. దరఖాస్తు విధానం ఇదే..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ లేదా మెడిసిన్.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది విద్యార్థుల లక్ష్యం ఇదే! అందుకోసం ఏటా లక్షల మంది నీట్, ఎంసెట్ పరీక్షల కోసం సిద్ధమవుతుంటారు.
కోవిడ్ కారణంగా వాయిదా పడ్డ ఈ ప్రవేశ పరీక్షలు త్వరలోనే జరగనున్నాయి. ఒకవైపు కరోనా.. మరోవైపు భవిష్యత్‌కు బాట వేసే ఎంట్రన్స్ టెస్టులు!! ఇలాంటి క్లిష్ట సమయంలో తెలుగు విద్యార్థులకు అండగా నిలిచేందుకు ‘సాక్షి మీడియా’ముందుకొచ్చింది. ఇంటి వద్దే ఆన్‌లైన్ మాక్ టెస్టులు రాసి.. తమ ప్రతిభను సమీక్షించుకొని.. ప్రిపరేషన్‌ను మెరుగుపరచుకునేందుకు ఇదో చక్కటి అవకాశం. ఈ టెస్టులు విద్యార్థి వాస్తవ పరీక్షలో రాణించేందుకు దోహదపడతాయి. సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో సబ్జెక్టు నిపుణుల పర్యవేక్షణలో ఆగస్టు 1వ తేదీ ఎంసెట్ ఇంజనీరింగ్, 3వ తేదీ ఎంసెట్ అగ్రికల్చర్, 28వ తేదీ నీట్ మాక్ టెస్టులు నిర్వహిస్తారు. ఈ టెస్టులకు MYRANK ఆన్‌లైన్ పోర్టల్ టెక్నాలజీ పార్టనర్‌గా వ్యవహరిస్తోంది.
ముఖ్య సమాచారం
ముఖ్య సమాచారం
- ఒక్కో పరీక్షకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.200. అభ్యర్థులు https://www.arenaone.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి, వెంటనే సదరు అభ్యర్థి ఈ–మెయిల్‌కు హాల్‌టికెట్ వస్తుంది.
- హాల్‌టికెట్ నంబర్, పాస్‌వర్డ్‌ల వివరాలు మెయిల్ ఐడీ/ రిజిస్టర్ ఫోన్ నంబర్లకు పంపిస్తారు. l sakshimocktest.myrank.co.in వెబ్‌సైట్‌లో ఇంటి దగ్గరే ఈ మాక్ టెస్టులు రాయొచ్చు.
- ఆన్‌లైన్ మాక్ టెస్టు జరిగే రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఈ వెబ్‌సైట్ అందుబాటులో ఉంటుంది. ఈ సమయం లో పరీక్ష ఎప్పుడు మొదలుపెట్టినా 3 గంటలలోపు ముగించాల్సి ఉంటుంది. పరీక్ష మొత్తం రాసిన తర్వాతే సబ్‌మిట్ చేయాలి. మధ్యలో సబ్‌మిట్ చేస్తే పరీక్ష రాసే అవకాశం ఉండదు.
- పరీక్ష పూర్తికాగానే మీ మార్కులు తెలుసుకోవచ్చు. పరీక్ష రాసిన రోజే సాయంత్రం 6 గంటలకు sakshimocktest.myrank.co.in లో ‘కీ’అందుబాటులో ఉంటుంది. వివరాలకు 95055 14424, 96660 13544, 99120 35299 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు.
Published date : 19 Jul 2021 04:16PM