TS EAMCET - 2024 : మేలో ఎంసెట్?
సాక్షి, హైదరాబాద్ః ఇంటర్ పరీక్షల తేదీలు వెల్లడవ్వడంతో ఎంసెట్‌పై అధికారులు దృష్టి పెట్టారు. ఇప్పటికే ఉన్నత విద్యా మండలి అధికారులతో విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈ అంశంపై సమీక్ష జరిపారు. సాధారణంగా ఎంసెట్ పరీక్షల తేదీలను ఇంటర్, జేఈఈ మెయిన్స్ తేదీలను బట్టి నిర్ణయిస్తారు. ఇంటర్ పరీక్షలు మార్చి 19తో ముగుస్తాయి. జేఈఈ ఏప్రిల్‌లో నిర్వహిస్తున్నారు. దీంతో మే నెలలో ఎంసెట్ నిర్వహణ సరైన సమయంగా అధికారులు భావిస్తున్నారు..
Also Read : EAMCET Practice Questions
గత ఏడాది జేఎన్‌టీయూహెచ్‌కు ఎంసెట్ బాధ్యతలు అప్పగించారు. ఈ ఏడాది కూడా ఇదే యూనివర్సిటీకి ఇచ్చే వీలుంది. అయితే, ఎంసెట్ కన్వీనర్ ఎవరనేది ఎంపిక చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు సీజీజీ నుంచి సాంకేతిక సహకారం తీసుకుంటారు. జాతీయ, రాష్ట్ర పరీక్షల తేదీలను గుర్తించి, ఎంసెట్ తేదీలను ఖరారు చేయడానికి ఇది తోడ్పడుతుంది.