TS EAMCET 2022: ఎంసెట్ ఫలితాల తేదీ ఖరారు
దీనిపై తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి నేతృత్వంలో ఉన్నతస్థాయి భేటీ జరగనుంది. ఇందులో ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్థన్, మండలి కార్యదర్శి శ్రీనివాస్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు. EAMCET Results తీరు తెన్నులు, ప్రాథమిక కీపై వచ్చిన అభ్యంతరాలను ఈ కమిటీలో చర్చిస్తారు. EAMCET Results విడుదల ఆగస్టు 15వ తేదీలోపే ఉండే వీలుంది. తామంతా సిద్ధంగానే ఉన్నామని, మంత్రి ఎప్పుడు తేదీ ఇస్తారో చూడాలని అధికారులు అంటున్నారు. ఎంసెట్ ఫలితాలు వెలువడిన తర్వాత Engineering Counselling ప్రక్రియ మొదలవ్వ నుంది. మరోవైపు JEE Results వెల్లడవ్వడం, ఈ నెలాఖరు నుంచి JEE Advanced పరీక్షల నేపథ్యంలో కౌన్సెలింగ్‌ను ఎన్ని దఫాల్లో పూర్తి చేయాలనే విషయాలపై అధికా రులు చర్చిస్తారు. కాగా, ఫలితాల వెల్లడి తర్వాత జేఎన్‌టీయూహెచ్ తన పరిధిలోని ప్రైవేటు కళాశాలలను తనిఖీ చేసి, అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.
→ College Predictor 2021 → AP EAPCET → TS EAMCET
చదవండి: