EAMCET 2022: తొలివిడత సీట్ల కేటాయింపు ఇలా..
రాష్ట్రవ్యాప్తంగా 176 ఇంజనీరింగ్ కాలేజీల్లో 71,286 సీట్లకు EAMCET ప్రవేశాల కమిటీ కౌన్సెలింగ్ నిర్వహించగా.. ఇందులో 60,208 సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తం సీట్లలో 84.45 శాతం సీట్లు తొలివిడతలో నిర్వహించిన కౌన్సెలింగ్‌లోనే భర్తీ కావడం గమనార్హం. EAMCET–2022 మొదటివిడత కౌన్సెలింగ్‌లో భాగంగా 74,334 మంది విద్యార్థులు స్లాట్ బుకింగ్ చేసుకుని ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. వీరిలో 73,195 మంది విద్యార్థులు వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొన్నారు. వివిధ కోర్సుల్లో 39,58,190 ఆప్షన్లు నమోదు చేసుకోగా 60,208 సీట్లు భర్తీ అయ్యాయి. కన్వీనర్ కోటాలో 11,078 సీట్లు ఖాళీగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
☛ College Predictor 2022 - AP EAPCET | TS EAMCET
13లోగా ఫీజు చెల్లించాలి
తొలివిడత కౌన్సెలింగ్‌లోనే రాష్ట్రవ్యాప్తంగా 32 కాలేజీల్లో సీట్లు వందశాతం భర్తీ అయ్యాయి. ఇందులో ఒక యూనివర్సిటీ కాలేజీ ఉండగా..మిగతా 31 ప్రైవేటు కాలే జీలు. రిజర్వేషన్ల వారీగా సీట్లు భర్తీ చేశారు. ఇందులో ఈడబ్ల్యూఎస్ కోటాలో 4,943 సీట్లు భర్తీ అయ్యాయి. సీట్లు పొందిన విద్యార్థులు వెంటనే వెబ్‌సైట్ ద్వారా అలాట్‌మెంట్ పత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలంగాణ ఎంసెట్–2022 కన్వీనర్ నవీన్‌మిట్టల్ సూచించారు. సీటు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ 13వ తేదీ లోగా వెబ్‌సైట్ ద్వారా డెబిట్ లేదా క్రెడిట్ కార్టు, నెట్ బ్యాంకింగ్ ద్వారా ట్యూషన్ ఫీజు చెల్లించాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కింద అర్హత ఉన్న విద్యా ర్థులు ఫీజు చెల్లించకుండా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోవల్సి ఉంటుంది. సీట్లు రిజర్వ్ చేసుకున్న విద్యార్థులు ఆక్టోబర్ 17వ తేదీ నుంచి 21లోగా అన్ని ధ్రువ పత్రాలు, జిరాక్స్ పత్రాలను కాలేజీలో సమర్పించాలి. నిర్దేశించిన కాలేజీల్లో రిపోర్టు చేయకుంటే వారి ప్రాథమిక సీటు కేటాయింపు రద్దవుతుందని ఎంసెట్ కన్వీనర్ తెలిపారు.
☛ Top Engineering Colleges 2022 - Andhra Pradesh | Telangana
కంప్యూటర్ సైన్స్‌కే డిమాండ్..
ఇంజనీరింగ్ కోర్సుల్లో కంప్యూటర్ సైన్స్‌కే డిమాండ్ ఎక్కువగా ఉంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ, కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టం, కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో వందశాతం సీట్లు భర్తీ కాగా, సీఎస్‌ఈలో 99.91 శాతం, ఐటీలో 99.76 శాతం, సీఎస్‌ఈ (డేటా సైన్స్)లో 99.64 శాతం, సీఎస్‌ఐటీలో 99.59 శాతం, ఏఐఎంఎల్‌లో 98.97 శాతం, సీఎస్‌ఈ (ఐఓటీ)లో 97.58శాతం చొప్పున సీట్లు భర్తీ అయ్యాయి. ఇక బయోమెట్రిక్ ఇంజనీరింగ్, ఈసీఐఈ, ఈసీఈ, ఈటీ కోర్సుల్లోనూ దాదాపు పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ అయ్యాయి.
చదవండి: EAMCET: ఇన్ని వేలలోపు ర్యాంకు సాధించిన వారికే పూర్తి ఫీజు చెల్లింపు
ఎంసెట్–2022 తొలివిడత సీట్ల కేటాయింపు ఇలా..
కేటగిరీ |
కాలేజీలు |
మొత్తం సీట్లు |
భర్తీ అయినవి |
ఖాళీ సీట్లు |
భర్తీ శాతం |
యూనివర్సిటీ |
16 |
4845 |
4118 |
727 |
84.99 |
ప్రైవేటు వర్సీటీ |
02 |
1460 |
1138 |
322 |
77.94 |
ప్రైవేటు |
158 |
64981 |
54952 |
10029 |
84.56 |
మొత్తం |
176 |
71286 |
60208 |
11078 |
84.45 |