TSCHE: దోస్త్, ఇంజనీరింగ్ షెడ్యూల్‌లో మార్పులు
అన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ పనిచేయక పోవడం, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ‘సాక్షి’ జూలై 21న వెలుగులోకి తెచ్చింది. దీంతో అధికారులు స్పందించి దోస్త్ షెడ్యూల్‌ను మార్చారు. మూడవ విడత సెల్ఫ్ రిపోర్టింగ్‌కు ఆఖరి తేదీని జూలై 21 నుంచి 26కు పొడిగించగా.. కాలేజీల్లో రిపోర్టు చేసే తేదీలను 22 నుంచి 26కు మార్చారు.
☛ College Predictor - 2023 - TS EAMCET | AP EAPCET - TS POLYCET | AP POLYCET
ఇంట్రా కాలేజీలో బ్రాంచీల మార్పునకు 28 చివరి తేదీ ఉండగా, దీన్ని 31 వరకు పొడిగించారు. ఇంజనీరింగ్ తొలి దశ సీట్లను ఇటీవల కేటాయించారు. జూలై 22కు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉండగా.. ఈ తేదీని 23కు మార్చారు. అయితే వరుస సెలవు దినాల నేపథ్యంలో ఈ తేదీని మరింత పొడిగించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
☛ Top 20 Engineering Colleges 2023 - Andhra Pradesh | Telangana