AP EAPCET 2021 Results: ఏపీ ఈఏపీసెట్(ఎంసెట్) బైపీసీ స్ట్రీమ్ ఫలితాలు విడుదల
ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ పరీక్షలకు మొత్తం 83,822 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 78,066 మంది పరీక్షకు హాజరయ్యారు. సెప్టెంబర్ 7వ తేదీతో ముగిసిన ఈ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత విధానం ద్వారా మొత్తం 5 విడతలుగా నిర్వహించారు. జేఎన్టీయూ కాకినాడ ఈఏపీసెట్ పరీక్షల నిర్వహణ బాధ్యతలను చూస్తోంది.
ఏపీ ఈఏపీసెట్-2021 ఫలితాల కోసం క్లిక్ చేయండి
రాష్ట్రంలో ఇంజినీరింగ్ తదితర కోర్సులకు గతంలో ఏపీ ఎంసెట్ పేరుతో నిర్వహించేవారు. మెడికల్ కోర్సుల ప్రవేశాలకు జాతీయ స్థాయిలో ‘నీట్’ నిర్వహిస్తుండటంతో మెడికల్ విభాగాన్ని ఎంసెట్ నుంచి మినహాయించారు. మెడికల్‌ను తొలగించడంతో ఏపీ ఎంసెట్‌ను ఏపీ ఈఏపీసెట్ (ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్)–2021 పేరుతో నిర్వహించారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్‌కు సంబంధించి ఆగస్టు 20, 23, 24, 25వ తేదీల్లో రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు.