Free Training: ఈ స్టడీసర్కిల్ ఆధ్వర్యంలో ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
Sakshi Education
పెద్దపల్లిరూరల్: బీసీ స్టడీసర్కిల్ ఆధ్వర్యంలో ఆన్‌లైన్ యాప్ ద్వారా డీఎస్సీ, ఎస్జీటీ టీచర్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రంగారెడ్డి తెలిపారు.
అక్టోబర్ 12 లోగా అర్హతగలవారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్యర్థులు ఆన్లైన్ శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని, 100 మందికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
చదవండి: Free training in electrical courses: ఎలక్ట్రికల్ కోర్సుల్లో ఉచిత శిక్షణ
బీసీలకు 75, ఎస్సీ 15, ఎస్టీ 5, ఈబీసీలకు 5 శాతం అవకాశం ఉంటుందని వివరించారు. పూర్తి వివరాలకు 0878– 2268686 నంబర్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.
Published date : 09 Oct 2023 01:45PM