ఓయూలో దూరవిద్య బీఈడీ కోర్సు రద్దు
Sakshi Education
హైదరాబాద్: ఓయూ పరిధిలోని రెగ్యులర్ కళాశాలల్లో ఇన్ సర్వీస్ టీచర్ల కోసం కొనసాగుతున్న రెండు సంవత్సరాల బీఈడీ కోర్సుతో పాటు బీఈడీ థర్డ్ మెథడాలజీ కోర్సులు రద్దయ్యాయి.
డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో (డెబ్) నిబంధనల ప్రకారం దూరవిద్య కోర్సు కేవలం సార్వత్రిక వర్సిటీలు, దూరవిద్య కేంద్రాలలో మాత్రమే నిర్వహించాలని సూచించడంతో ఓయూ పరిధిలోని కళాశాలల్లో బీఈడీ కోర్సును రద్దు చేశారు. ఈ కోర్సును తిరిగి ప్రారంభించేందుకు ఓయూ దూరవిద్య కేంద్రం నుంచి ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Published date : 11 Aug 2017 02:01PM