ఓయూ దూరవిద్య ప్రవేశ ప్రకటన విడుదల
Sakshi Education
ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్.జి.రామిరెడ్డి దూరవిద్య కేంద్రం 2015-16లో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన వెలువడింది.
రెండు వృత్తివిద్యా కోర్సులు, ఆరు డిగ్రీ, డిప్లొమా కోర్సులు, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులతో పాటు 18 పీజీ కోర్సులలో ప్రవేశానికి ఈ నెల 15 నుంచి అక్టోబర్ 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని రిజిస్ట్రార్ ప్రొ.సురేశ్‌కుమార్ తెలిపారు. దరఖాస్తులను www.oucde.net నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని వికారాబాద్, తాండూరు, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, నల్లగొండ, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నిజామాబాద్, సూర్యాపేటలలో కొత్తగా అడ్మిషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ విద్య సంవత్సరం నుంచి ఎమ్‌కాం లో కార్పొరేట్ గవర్నెన్స్, అకౌంటింగ్ టెక్నిషియన్, సాఫ్ట్ స్కిల్స్ కోర్సులు, కాంప్రహెన్షన్ స్కిల్స్, అకౌంటింగ్ ప్యాకేజీ, ఫొటోగ్రఫీ సర్టిఫికెట్ కోర్సులను ప్రవేశ పెట్టినట్లు ఓయూ దూరవిద్య డెరైక్టర్ ప్రొఫెసర్. హెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు.
Published date : 11 Jul 2015 02:04PM