‘ఓపెన్’ డిగ్రీ దరఖాస్తులకు మార్చి 28 వరకు గడువు
Sakshi Education
హైదరాబాద్: బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ ప్రవేశాల కోసం అర్హత పరీక్ష-2019కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 28 చివరి తేదీ అని విశ్వవిద్యాలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఇందుకు ఇంటర్ లేదా దాని తత్సమానమైన అర్హతగల విద్యార్థులు ప్రవేశం పొందాలంటే ఈ అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. కాగా వారికి 2019, జూలై 1 నాటికి 18 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. దరఖాస్తు ఫారంలో అడిగిన వివరాలతో పాటు పాస్‌పోర్ట్ సైజు ఫొటో అప్‌లోడ్ చేయాలి. ఆ తర్వాత రూ.300 పరీక్ష ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. ఏప్రిల్ 28వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోని స్టడీ సెంటర్‌లలో ఎక్కడైనా పరీక్షకు నమోదు చేసుకోవచ్చు. అర్హత సాధించిన అభ్యర్థులు 2019-20 సంవత్సరానికి బీకాం, బీఏ, బీఎస్సీ కోర్సుల్లో చేరేందుకు అవకాశం ఉంటుంది.
Published date : 21 Mar 2019 03:00PM