జూలై 12 వరకు జేఎన్‌టీయూకే ఎంఎస్‌ఐటీ స్పాట్ అడ్మిషన్లు
Sakshi Education
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): తూర్పు గోదావరి జిల్లా జేఎన్‌టీయూ- కాకినాడ, మెల్లాన్ యూనివర్సిటీ (అమెరికా) సంయుక్తంగా నిర్వహిస్తున్న రెండేళ్ల ఎంఎస్‌ఐటీ (పీజీ) కోర్సు స్పాట్ అడ్మిషన్ల గడువు జూలై 12వ తేదీతో ముగుస్తున్నట్లు కో- ఆర్డినేటర్ డాక్టర్ సహాదేవయ్య జూలై 9న ఓ ప్రకటనలో తెలిపారు.
ఎంఎస్ ఐటీ (మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) కోర్సులో వివిధ కేటగిరీల్లో ఖాళీగా ఉన్న సీట్లను స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. కోర్సులో చేరేందుకు గేట్ ఉత్తీర్ణత కాకపోయినా బీటెక్ ఏ విభాగంలో ఉత్తీర్ణులైన అభ్యర్థులైనా అర్హులన్నారు. రెండేళ్లకు దాదాపు రూ. 3 లక్షలు ఖర్చవుతుందని, అభ్యర్థి అడ్మిషన్ పొందితే వారికి విద్యా రుణం మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. జేఎన్‌టీయూకే అనుబంధ కళాశాలల్లో ఉన్న 8 జిల్లాల ఇంజినీరింగ్ కళాశాలలతో పాటు ఇతర జిల్లాల ఇంజినీరింగ్ కళాశాల అభ్యర్థులు హాజరుకావచ్చని, వివరాలకు 7799834586 నంబర్‌కు సంప్రదించవచ్చన్నారు.
Published date : 10 Jul 2018 02:48PM