ఇగ్నో– 2021 కోర్సుల్లో వ్రేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education
నాంపల్లి (హైదరాబాద్): ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) జూలై–2021 విడతకు సంబంధించి పలు సర్టిఫికెట్, పీజీ సర్టిఫికెట్, డిప్లొమా, పీజీ డిప్లొమా, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం ఇన్‌చార్జి సంచాలకుడు డాక్టర్ కె.రమేష్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఆయా కోర్సుల్లో ప్రవేశం పొందడానికి విద్యార్థులు జూలై 15 వరకు ఆన్‌లైన్ పద్ధతిలో ఇగ్నో వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
Published date : 18 Jun 2021 01:59PM