ఏప్రిల్ 12న అంబేద్కర్ వర్సిటీ ప్రవేశ పరీక్ష
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న బీఏ, బీఎస్సీ, బీకాం కోర్సుల్లో 2015-16 విద్యాసంవత్సరానికి నిర్వహించనున్న ప్రవేశ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ గురువారం విడుదలైంది.
ఏప్రిల్ 12వ తేదీన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్టడీ సెంటర్స్‌లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఫిబ్రవరి 28వ తేదీ లోగా ఠీఠీఠీ.ఛట్చౌఠౌజ్ఛీ.జీలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి విద్యార్హత లేని వారు, చదవడం, రాయడం తెలిసి ఉండి.. 2015 జులై 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Published date : 02 Jan 2015 02:27PM