డిసెంబర్ 5 నుంచి ఏఎన్‌యూ దూరవిద్య పరీక్షలు
Sakshi Education
ఏఎన్‌యూ (గుంటూరు): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం నిర్వహించే డిగ్రీ, పీజీ, డిప్లొమో, సర్టిఫికెట్, ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సుల పరీక్షలు డిసెంబర్ 5 నుంచి ప్రారంభంకానున్నాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు దూరవిద్యా కేంద్రం డెరైక్టర్ ఆచార్య పి.శంకర్ పిచ్చయ్య, పరీక్షల కో-ఆర్డినేటర్ కె.వీరయ్య తెలిపారు. పరీక్షల నిర్వహణ తీరును పర్యవేక్షించేందుకు ప్రత్యేక తనిఖీ బృందాలను, పరిశీలకులను నియమించినట్టు పేర్కొన్నారు. పరీక్షల టైంటేబుల్ తదితర వివరాలను www.anucde.info వెబ్‌సైట్‌లో పొందవచ్చన్నారు.
Published date : 05 Dec 2017 04:11PM