అంబేడ్కర్ వర్సిటీలో ప్రవేశాల గడువు పెంపు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పీజీ ప్రవేశాల తేదీలను పొడిగించినట్లు వర్సిటీ రిజిస్ట్రార్ సి. వెంకటయ్య శనివారం తెలిపారు.
ఆలస్య రుసుం లేకుండా సెప్టెంబర్ 8 లోగా ప్రవేశాలు పొందవచ్చని పేర్కొన్నారు. ట్యూషన్ ఫీజును టీఎస్/ఏపీ ఆన్‌లైన్, క్రెడిట్/డెబిట్ కార్డులు, ఎస్‌బీహెచ్ నెట్ బ్యాంకింగ్ విధానంలో చెల్లించాలన్నారు.
Published date : 22 Aug 2016 05:51PM