ఆగస్టు 16 నుంచి ఓయూ దూరవిద్య కోర్సుల్లో ప్రవేశాలు
Sakshi Education
హైదరాబాద్: ఓయూ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రొఫెసర్ జి.రామిరెడ్డి దూరవిద్య కేంద్రంలో 2017-18 విద్యా సంవత్సరానికి డిగ్రీ, డిప్లొమా, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఆగస్టు 16 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
దూరవిద్య కేంద్రంలో కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ ప్రవేశాలకు రూపొందించిన వెబ్‌సైట్‌ను వీసీ ప్రొఫెసర్ రాంచంద్రం ఆగస్టు 12న ప్రారంభించారు. అనంతరం ప్రవేశాల నోటిఫికేషన్, బ్రోచర్‌ను ఆవిష్కరించారు. దూరవిద్య డెరైక్టర్ ప్రొఫెసర్ గణేష్ మాట్లాడుతూ, ఈ విద్యా సంవత్సరం నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు విధానాన్ని ప్రవేశపెడుతున్నామని చెప్పారు. www.oucde.net వెబ్‌సైట్ ద్వారా డిగ్రీ, డిప్లొ మా, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. సీటు సాధించిన అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను ఓయూ క్యాంపస్‌లోని దూరవిద్య కేంద్రంలో పరిశీలిస్తామన్నారు. పూర్తి వివరాలు osmania.ac.in వెబ్‌సైట్లో చూడవచ్చు.
Published date : 14 Aug 2017 02:21PM