Skip to main content

The winner of the ‘Finalisima’ is Argentina‘: ఫినలిసిమా’ విజేత అర్జెంటీనా

The winner of the ‘Finalisima’ is Argentina
The winner of the ‘Finalisima’ is Argentina
  • లండన్‌: స్టార్‌ స్ట్రయికర్‌ లియోనల్‌ మెస్సీ రాణించడంతో ‘ఫినలిసిమా’ ట్రోఫీని అర్జెంటీనా గెలుచుకుంది.  3–0 గోల్స్‌ తేడాతో ఇటలీని అర్జెంటీనా ఓడించింది. రెండు ఖండాలు దక్షిణాఫ్రికా, యూరోప్‌ల విజేతల మధ్య పోరు నిర్వహించేలా తొలి సారి ఈ టోర్నీని ప్రవేశపెట్టారు. అర్జెంటీనా, ఇటలీ ఇందులో తలపడ్డాయి.  వెంబ్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌కు 87,000 మంది ప్రేక్షకులు పోటెత్తారు.
  • సాకర్‌ దిగ్గజం మెస్సీ తన అనుభవాన్నంతా ఉపయోగించి జట్టును విజేతగా నిలిపాడు. ఈ మ్యాచ్‌లో లాటరో మార్టినెజ్‌ (28వ ని.), ఎంజెల్‌ డి మరియా (45+1వ ని.), పాలో డైబల (90+4వ ని.) గోల్‌ చేశారు. అయితే ఈ స్కోరులో మెస్సీ కీలక పాత్ర పోషించాడు. పాదరసంలా కదులుతూ బంతిని అత్యంత చాకచక్యంగా పాస్‌ చేయడంతో అర్జెంటీనా 3 గోల్స్‌ చేసింది. మ్యాచ్‌ ముగిసి న అనంతరం అర్జెంటీనా ఆటగాళ్లంతా మెస్సీకి బ్రహ్మరథం పట్టారు.
  • Download Current Affairs PDFs Here
  • Chessable Masters: 2022లో మాగ్నస్ కార్ల్‌సెన్‌పై ఆర్ ప్రజ్ఞానంద 2వ సారి విజయం
Published date : 03 Jun 2022 04:18PM

Photo Stories