Andhra Pradesh: సీ కయాకింగ్ చాంపియన్ షిప్‌ను ఎక్కడ నిర్వహించనున్నారు?
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వేదికగా.. జాతీయస్థాయి సీ కయాకింగ్ చాంపియన్‌షిప్–2022 నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కయాకింగ్ అండ్ కనోయింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో... విశాఖలోని రుషికొండలో జూన్ 24 నుంచి 26 వరకు ఈ క్రీడలు జరగనున్నాయి. ఈ పోటీలను దేశంలో రెండోసారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటిసారి నిర్వహిస్తున్నారు.
GK Important Dates Quiz: అంతర్జాతీయ గనుల అవగాహన దినోత్సవం?
వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రీడల్లో..
కయాకింగ్, కానోయింగ్ వాటర్ స్పోర్ట్స్‌కు దాదాపు అన్ని దేశాల్లోనూ మంచి గుర్తింపు ఉంది. సముద్రంలో అలలను చీల్చుకుంటూ.. ప్రత్యేకమైన నావలో గమ్యాన్ని చేరుకునేందుకు డైవర్లు పోటీ పడుతుంటారు. ఇటీవల అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వినోద క్రీడల్లో కయాకింగ్ అగ్ర భాగంలో ఉంది. ఇలాంటి క్రీడల్ని నిర్వహించే సా మర్థ్యం ఉన్న బీచ్‌లు దేశంలో అతి తక్కువగా ఉన్నాయి. అందులో విశాఖ తీరంలోను పోటీలకు అనువైన వాతావరణం ఉండటంతో రాష్ట్రంలో మొదటిసారి కయాకింగ్ పోటీలు జరగబోతున్నాయి.
వక్ఫ్‌బోర్డు చైర్మన్‌గా మహ్మద్ మసీఉల్లా ఖాన్..
తెలంగాణ రాష్ట వక్ఫ్‌బోర్డు చైర్మన్‌గా మహ్మద్ మసీఉల్లాఖాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మే 07న హజ్‌హౌస్‌లోని రాష్ట్ర వక్ఫ్‌బోర్డు కార్యాలయంలో పాలక మండలి సభ్యులు సమావేశమై ఈ మేరకు ఎన్నుకున్నారు. మసీఉల్లా ఖాన్ ఇప్పటి వరకు రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. Athletics: 5000 మీటర్ల పరుగులో కొత్త రికార్డు నెలకొల్పిన ఆటగాడు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : జూన్ 24 నుంచి 26 వరకు జాతీయస్థాయి సీ కయాకింగ్ చాంపియన్‌షిప్–2022 నిర్వహణ
ఎప్పుడు : మే 08
ఎవరు : ఆంధ్రప్రదేశ్‌లోని కయాకింగ్ అండ్ కనోయింగ్ అసోసియేషన్..
ఎక్కడ : రుషికొండ బీచ్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్