Skip to main content

Tennis Star Serena Williams Retires: 27 ఏళ్ల కెరీర్‌కు సెరెనా విలియమ్స్ గుడ్ బై

27 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో సెరెనా విలియమ్స్‌ 23 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు నెగ్గింది.
Tennis Star Serena Williams bids goodbye
Tennis Star Serena Williams bids goodbye

అమెరికన్‌ మహిళ టెన్నిస్‌ స్టార్‌.. సెరెనా విలియమ్స్‌ సెప్టెంబర్ 3 న జరిగిన విమెన్స్ సింగిల్స్ మూడో రౌండ్‌లో సెరెనా 5-7, 7-6 (7/4), 1-6 తో ఆస్ట్రేలియాకు చెందిన అజ్లా టామ్లానోవిక్ చేతిలో పోరాడి ఓడిపోయింది. దీంతో 24వ గ్రాండ్‌స్లామ్‌ అందుకోవాలన్న ఆమె కల తీరకుండానే కెరీర్‌ ముగించింది.  

Also read: World Badminton Championship 2022 : ప్రపంచ బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌లో.. 

27 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో సెరెనా విలియమ్స్‌ 23 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు నెగ్గింది. ఇందులో ఏడుసార్లు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, మూడుసార్లు ఫ్రెంచ్‌ ఓపెన్‌, ఏడుసార్లు వింబుల్డన్‌.. మరో ఆరుసార్లు యూఎస్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచింది.

Also read: Quiz of The Day (September 01, 2022): నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎక్కడ జన్మించారు?

ఈ తరంలో మహిళల టెన్నిస్‌ విభాగంలో అత్యధిక టైటిళ్లు గెలిచిన క్రీడాకారిణిగా సెరెనా రికార్డు సృష్టించింది. 2017లో ప్రెగ్నెంట్‌ ఉ‍న్న సమయంలోనే సెరెనా చివరిసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ నెగ్గింది. అయితే, వయసు మీద పడటం, గాయాల కారణంగా గత ఐదేళ్లలో ఆమె ఒక్క గ్రాండ్ స్లామ్ కూడా గెలవలేకపోయింది. దాంతో 41 ఏళ్ల సెరెనా కెరీర్ ముగించాలని నిర్ణయానికి వచ్చింది.

Also read: India vs Pakistan Cricket Match : పాకిస్తాన్‌పై భారత్‌ ఘ‌న విజయం.. రికార్డులు ఇవే..

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 03 Sep 2022 06:35PM

Photo Stories