Skip to main content

India vs Pakistan Cricket Match : పాకిస్తాన్‌పై భారత్‌ ఘ‌న విజయం.. రికార్డులు ఇవే..

భారత్‌–పాక్‌ మధ్య ఆగస్టు 28వ తేదీన (ఆదివారం) జరిగిన ఆసియా కప్‌ టి20 టోర్నీ ఉత్కంఠగా జరిగింది.

చివరకు భారత్‌ 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. మొదట పాకిస్తాన్‌ 19.5 ఓవర్లలో 147 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్‌ రిజ్వాన్‌ (42 బంతుల్లో 43; 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. సీమర్లు భువనేశ్వర్‌ (4/26), హార్దిక్‌ పాండ్యా (3/25) పాక్‌ను కట్టడి చేశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్‌ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసి గెలిచింది. కెరీర్‌లో 100వ టి20 మ్యాచ్‌ ఆడిన కోహ్లి (34 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్‌) విలువైన పరుగులు జతచేస్తే.. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హార్దిక్‌ పాండ్యా (17 బంతుల్లో 33 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌), జడేజా (29 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి గెలిపించే ఇన్నింగ్స్‌ ఆడాడు.

రికార్డులు ఇవే..
☛ అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టులోని మొత్తం 10 వికెట్లు భారత పేసర్లకే దక్కడం ఇదే తొలిసారి. 
☛ అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్స్‌లో రోహిత్‌ శర్మ (133 మ్యాచ్‌ల్లో 3,499 పరుగులు) అగ్రస్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్‌ క్రికెటర్‌ గప్టిల్‌ (121 మ్యాచ్‌ల్లో 3,497 పరుగులు) రెండో స్థానానికి పడిపోయాడు. 
☛ పాక్‌తో మ్యాచ్‌లో ఆడటంద్వారా కోహ్లి మూడు ఫార్మాట్‌లలో (టెస్టు, వన్డే, టి20) కనీసం 100 మ్యాచ్‌లు ఆడిన తొలి భారతీయ క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. ఇప్పటివరకు కోహ్లి 102 టెస్టులు, 262 వన్డేలు, 100 టి20 మ్యాచ్‌లు ఆడాడు.

Published date : 29 Aug 2022 05:47PM

Photo Stories