Skip to main content

Suryakumar Yadav : సూర్యకుమార్‌ యాదవ్‌.. అగ్రస్థానానికి అడుగు దూరంలో..

టీ-20 తాజా ర్యాకింగ్స్‌ను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి సెప్టెంబ‌ర్ 28వ తేదీన (బుధవారం) విడుదల చేసింది.
Suryakumar yadav, Indian Cricketer
Suryakumar yadav

ఇందులో టీమిండియా బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ సత్తా చాటాడు. అద్భుత ఫామ్‌లో ఉన్న అతడు మరోసారి కెరీర్‌ బెస్ట్‌ ర్యాంకుకు చేరుకున్నాడు. కాగా ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌లో సూర్య రాణించిన విషయం తెలిసిందే.

India Vs South Africa T20, ODI Series Match Schedule : టీమిండియా-దక్షిణాఫ్రికా టీ20, వన్డే జట్టు ఇదే.. మ్యాచ్‌ల షెడ్యూల్ ఇలా..

801 రేటింగ్‌ పాయింట్లు సాధించి..

Suryakumar Yadav ICC T20 Rankings 2022

ముఖ్యంగా హైదరాబాద్‌లో జరిగిన మూడో టీ20లో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. 36 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 69 పరుగులు చేశాడు. తద్వారా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.ఈ క్రమంలో 801 రేటింగ్‌ పాయింట్లు సాధించిన ఈ ముంబై బ్యాటర్‌ మరోసారి రెండో ర్యాంకు అందుకున్నాడు. ఇక పాకిస్తాన్‌ ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ 861 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

T20 World Cup New Rules : టి-20 వ‌ర‌ల్ట్ క‌ప్‌లో అమ‌లు కానున్న కొత్త రూల్స్ ఇవే.. ఫ‌స్ట్ టైమ్‌..

కోహ్లి స్థానం ఇదే..

kohli

దక్షిణాఫ్రికా బ్యాటర్‌ ఎయిడెన్‌ మార్కరమ్‌ రెండో ర్యాంకు కోల్పోయి.. నాలుగో స్థానానికి పడిపోగా.. పాక్‌ సారథి బాబర్‌ ఆజం ఒక ర్యాంకు మెరుగుపరచుకుని మూడో స్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లండ్‌ స్వదేశంలో ఏడు మ్యాచ్‌ టీ20 సిరీస్‌లో భాగంగా బాబర్‌.. రెండో మ్యాచ్‌లో 110 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇదిలా ఉంటే.. టీమిండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లి ఒక స్థానం మెరుగుపరచుకుని 15వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఇక టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 13వ స్థానంలో ఉన్నాడు.

T20 Highest Wicket Taker : 600 వికెట్లతో ప్రపంచ రికార్డు.. తొలి బౌలర్‌గా..

ఐసీసీ టీ-20 బ్యాటింగ్ విభాగంలో టాప్‌-5లో ఉన్నది వీళ్లే..
1. మహ్మద్‌ రిజ్వాన్‌(పాకిస్తాన్‌)
2. సూర్యకుమార్‌ యాదవ్‌(ఇండియా)
3. బాబర్‌ ఆజం(పాకిస్తాన్‌)
4. ఎయిడెన్‌ మార్కరమ్‌(దక్షిణాఫ్రికా)
5. ఆరోన్‌ ఫించ్‌(ఆస్ట్రేలియా)

Published date : 28 Sep 2022 07:19PM

Photo Stories