Skip to main content

ICC ODI Rankings: కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌లో శుబ్‌మన్‌ గిల్‌.. కొహ్లి ఎన్నో స్థానంలో ఉన్నాడంటే..

అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) వన్డే ర్యాంకింగ్స్‌లో భారత ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌ను అందుకున్నాడు.
Shubman Gill

ఏప్రిల్ 5న‌ విడుదల చేసిన బ్యాటింగ్‌ తాజా ర్యాంకింగ్స్‌లో గిల్‌ ఒక స్థానం పురోగతి సాధించి ఐదు నుంచి నాలుగో స్థానానికి చేరుకున్నాడు. భారత్‌కే చెందిన విరాట్‌ కోహ్లి ఆరో ర్యాంక్‌లో, రోహిత్‌ శర్మ ఎనిమిదో ర్యాంక్‌లో ఉన్నారు. పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 

బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో భారత పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన జోష్‌ హాజిల్‌వుడ్‌, కివీస్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ అతనికంటే ముందున్నారు. సూర్యకుమార్‌ యాదవ్‌ టి20 బ్యాటర్లలో అగ్రస్థానంలో, ఆల్‌రౌండర్లలో హార్దిక్‌ పాండ్యా రెండో స్థానంలో కొనసాగుతున్నారు.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)

Published date : 06 Apr 2023 01:38PM

Photo Stories