Retirement: క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత జట్టు మాజీ సభ్యుడు?
అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్‌ల నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్లు భారత జట్టు మాజీ సభ్యుడు, వివాదాస్పద క్రికెటర్ శాంతకుమారన్ నాయర్ శ్రీశాంత్ తాజగా ప్రకటించాడు. కేరళకు చెందిన 39 ఏళ్ల శ్రీశాంత్ భారత్ తరఫున 27 టెస్టులు (87 వికెట్లు), 53 వన్డేలు (75 వికెట్లు), 10 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు (7 వికెట్లు) ఆడాడు. ధోని నాయకత్వంలో భారత్ గెలిచిన 2007 టి20 వరల్డ్‌కప్, 2011 వన్డే వరల్డ్‌కప్ జట్లలో శ్రీశాంత్ సభ్యుడిగా ఉన్నాడు. 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో నిందితుడైన శ్రీశాంత్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జీవితకాల నిషేధం విధించింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు జోక్యంతో శ్రీశాంత్‌పై ఉన్న జీవితకాల నిషేధాన్ని బీసీసీఐ తొలగించి దానిని ఏడేళ్లకు కుదించింది. దాంతో నిషేధం గడువు పూర్తయ్యాక శ్రీశాంత్ కేరళ రంజీ జట్టులో పునరాగమనం చేశాడు. 2022, ఫిబ్రవరి నెలలో మేఘాలయ జట్టుతో జరిగిన రంజీ మ్యాచ్‌లో చివరిసారి శ్రీశాంత్ బరిలోకి దిగాడు.
Belgrade Indoor Meeting 2022: పోల్ వాల్ట్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఆటగాడు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్‌ల నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్లు ప్రకటించిన భారత జట్టు మాజీ సభ్యుడు?
ఎప్పుడు : మార్చి 9
ఎవరు : శాంతకుమారన్ నాయర్ శ్రీశాంత్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్